పయ్యావుల కేశవ్ తన 29 ఏళ్ల వయస్సులో ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి 1994 నుంచి 2024 వరకు ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికలు పోటీ చేసి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 1999 మరియు 2014 శాసనసభ ఎన్నికల్లో మాత్రం ఓడిపోయాడు. పయ్యావుల కేశవ్ 2024 లో ఎమ్మెల్యేగా ఎన్నికై జూన్ 12 న ఆర్థిక &ప్రణాళిక , వాణిజ్య పన్నులు & అసెంబ్లీ వ్యవహారాలు శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు. ఇకపోతే ఈ సారి ఎన్నికలలో టి డి పి పార్టీ ఒంటరిగా కాకుండా జనసేన బిజెపి లతో పాటు పుత్తులో భాగంగా పోటీలోకి దిగింది.

ఇక ఈ సారి కూడా ఈయన ఉరవకొండ నియోజకవర్గం నుండి పోటీలోకి దిగి తన సమీప అభ్యర్థి అయినటువంటి వై సీ పీ పార్టీ నేత వై విశ్వేశ్వర రెడ్డి పై గెలుపొందారు. ఇక ఈయన ఐదవ సారి ఎమ్మెల్యేగా గెలవడంతో ఈయనకు చంద్రబాబు క్యాబినెట్ లో కచ్చితంగా అవకాశం వస్తుంది అని అంతా అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఈయనకు చంద్రబాబు క్యాబినెట్ లో అవకాశం వచ్చింది. ఈయనకు ఫైనాన్స్ , ప్లానింగ్ , కమర్షియల్  టాక్సెస్ అండ్ లెజిస్టేటివ్ మినిస్ట్రీ పదవులను చంద్రబాబు కట్టబెట్టాడు.

ఇకపోతే ఈయనకు ఈ పదవులు దక్కడంపై ఈయన అనుచరులు , కార్యకర్తలు చాలా సంతోషం గానే ఉన్నప్పటికీ కొంత మంది మాత్రం పయ్యావుల కేశవ్ కు ఈ మంత్రి పదవుల కంటే కూడా రెవెన్యూ శాఖ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది అని ఆయన అందులో చాలా నిష్ణాతుడు వాటి గురించి ఆయనకు బాగా తెలుసు అది ఇచ్చి ఉంటే చాలా సమర్థవంతంగా పని చేసేవాడు అని , ఇప్పుడు కూడా ఆయన పని తనం బాగానే ఉంటుంది కాకపోతే ఆయన తనకు ఇచ్చిన మంత్రిత్వ శాఖల గురించి తెలుసుకోవడానికి కాస్త సమయం పడుతుంది అని కొంత మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: