ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీకి ఏ ఇతర చోట్ల లేని బలం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉండేది. ఇక్కడ వీరికి పోటీనే లేదు అనే విధంగా ఇక్కడ నేతల మాటలు కూడా ఉండేవి. వారి మాటలకు తగిన ఫలితాలు కూడా గతంలో ఇక్కడ నుండి వచ్చాయి. ఈ ప్రాంతం నుండి వైసీపీ పార్టీకి పోటీగా నిలబడాలి అంటే కూడా వ్యక్తులు భయపడే పరిస్థితులు వచ్చాయి. ఎందుకు అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చాలా నియోజకవర్గాలలో వైసిపి పార్టీకి చెందిన అభ్యర్థులు అత్యంత భారీ మెజార్టీతో గెలిచిన సందర్భాలు ఇక్కడ ఉన్నాయి.

కానీ 2024 ఎలక్షన్లలో ఈ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా గిద్దలూరు , మార్కాపురం , కనిగిరి , దర్శి , ఎర్రగొండపాలెం ప్రాంతాలు వై సి పి పార్టీకి కంచుకోటల్లా ఉండేవి. వీటి విషయంలో వైసీపీ ఎలాంటి డోకా లేదు ఇక్కడి 5 అసెంబ్లీ స్థానాలు మనకే కన్ఫామ్ అన్న స్థాయిలో వీరి కాన్ఫిడెన్స్ ఉంది. కానీ ఫలితాలు మాత్రం ఎందుకు పూర్తి వ్యతిరేకంగా వచ్చాయి. గిద్దలూరు , మార్కాపురం , కనిగిరి ఈ మూడు నియోజకవర్గాలలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందారు.

ఇక్కడ గెలవడం మాత్రమే కాకుండా వీరు భారీ మెజారిటీతో గెలిచారు. దర్శి , ఎర్రగొండపాలెం లో వైసీపీ పార్టీలు గెలిచినప్పటికీ అతి తక్కువ మెజారిటీతో గెలుపొందారు. వీరు కూడా కొంచెం అటు ఇటు అయితే ఓడిపోయే అవకాశాలే ఉండేవి. ఇక ఈ ఐదు ప్రాంతాలలో వైసిపి బలం తగ్గడానికి , టిడిపి బలం పెరగడానికి ప్రధాన కారణం ఏమిటి అనే విశ్లేషణలు అనేక మంది చేస్తున్నారు. అందులో భాగంగా ఈ ఐదు నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ ఉంటారు. వారి వల్లే వైసీపీ కి గతంలో భారీ ఓటు బ్యాంకు వచ్చింది. అని ఈ సారి వారంతా వైసిపి వైపు కాకుండా టిడిపి వైపు మొగ్గు చూపారు. అందుకే వైసిపి ఇక్కడ ప్రభావం చూపలేకపోయింది. టిడిపి పుంజుకుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: