ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు... జరిగిన సంగతి తెలిసిందే.  ఇక కొత్తగా మంత్రివర్గం కూడా ఏర్పాటు అయి... శాఖలను కూడా కేటాయించారు సీఎం చంద్రబాబు నాయుడు. పాలనపై కూడా చంద్రబాబు దృష్టి పెట్టి.... ఏకంగా 5 ఫైల్స్ పై సంతకం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా... ముందుకు సాగుతున్నారు చంద్రబాబు నాయుడు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా ఎవరు నియామకం అవుతారని దానిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ తెరపైకి వచ్చింది.
 

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం...  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా... తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అయ్యన్నపాత్రుడికి చంద్రబాబు నుంచి ఫోన్ కాల్ కూడా వెళ్ళిందట. సోషల్ మీడియాలో ఇదే విషయం ప్రచారం జోరుగా సాగుతోంది. దాదాపు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన... ఆయన పాత్రుడికి ఖచ్చితంగా స్పీకర్ పదవి ఇచ్చి తీరుతారని అంటున్నారు. అయితే అయ్యన్నపాత్రుడు మాత్రం... ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో స్థానం దక్కుతుందని ముందు నుంచి భావించారు. ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి పాలనలో... పార్టీని కాపాడుకుంటూ... అనేక కష్టాలు పడ్డారు అయ్యన్నపాత్రుడు. చాలాసార్లు జైలు పాలు కూడా అయ్యారు.  ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై నిత్యం సీరియస్ గా పోరాటం చేస్తూ.. తీవ్రమైన పదజాలంతో వ్యాఖ్యలు చేసేవారు అయ్యన్నపాత్రుడు. అలాంటి చురుకైన నాయకునికి కచ్చితంగా... మంత్రి పదవి వస్తుందని అందరు అనుకున్నారు.

 

 అయితే చివరికి అయ్యన్న పాత్రుడికి మంత్రి పదవి ఇవ్వకుండా మొండి చేయి చూపించారు చంద్రబాబు. అయితే ఆయనకు స్పీకర్ పదవి ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. గతంలో ఉత్తరాంధ్ర కే చెందిన... బీసీ నేత తమ్మినేని  సీతారాం కు  స్పీకర్ పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇక ఇప్పుడు కూడా ఉత్తరాంధ్రకు చెందిన అయ్యన్నపాత్రుడు కే...స్పీకర్ పదవి వస్తుందని అంటున్నారు. దీనిపై రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ కూడా ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి: