ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి కూటమి తరపున 12 మంది ఎమ్మెల్యేలు గెలవగా ఈ 12 మందిలో ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి మంత్రి పదవిని పొందిన వాళ్లలో బీసీ జనార్ధన్ రెడ్డి ఒకరు కావడం గమనార్హం. బీసీ జనార్ధనరెడ్డికి తొలిసారి మంత్రి పదవి దక్కగా ఆయనకు చంద్రబాబు రోడ్లు & భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖలను కేటాయించారు.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పరాజయానికి రోడ్లు కూడా ఒక విధంగా కారణమనే సంగతి తెలిసిందే. సరైన రోడ్లు లేకపోవడం వల్ల ఏపీ ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. వర్షాకాలంలో సరైన రోడ్లు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరిగిన సందర్భాలు సైతం సైతం ఎక్కువగానే ఉన్నాయి. బీసీ జనార్ధన్ రెడ్డికి ఈ శాఖ కేటాయించడం అంటే ఆయనపై కొండంత భారం మోపినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
ఏపీలో రోడ్ల విషయంలో నెలకొన్న అన్ని విమర్శలకు ఈ మంత్రి చెక్ పెడతారా అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. బీసీ జనార్ధన్ రెడ్డికి మంత్రిగా అనుభవం లేకపోవడంతో ఆయనకు కేటాయించిన శాఖల విషయంలో చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెడితే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీసీ జనార్ధన్ రెడ్డికి మంత్రి పదవి దక్కడం కర్నూలు వాసులకు సంతోషాన్ని కలిగించింది.
 
నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసి ప్రజల మనస్సులను గెలుచుకుని మంత్రి పదవి పొందిన బీసీ జనార్ధన్ రెడ్డి ఆ పదవికి పూర్తి న్యాయం చేసి నియోజకవర్గంలో మంచి పేరును సొంతం చేసుకోవాలని కర్నూలు వాసులు కోరుకుంటున్నారు. బీసీ జనార్ధన్ రెడ్డికి మంత్రి పదవి దక్కిన నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు మేలు జరుగుతుందని జిల్లావాసులు కామెంట్లు చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ రోజురోజుకు పుంజుకునేలా చంద్రబాబు నిర్ణయాలు ఉండటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: