ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. పోలీసుల కాల్పుల్లో మావోయిస్టులు ఏకంగా ఎనిమిది మంది మరణించారు.  ఈ సంఘటన శనివారం రోజున ఉదయం చోటు చేసుకుంది. అయితే ఆలస్యంగా ఈ విషయాన్ని పోలీసులు మీడియాకు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఛత్తీస్ ఘడ్ లో జరిగిన మారణకాండ గురించి  వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.


పోలీసులు అలాగే మావోయిస్టుల మధ్య... ఇవాళ ఉదయం 9 గంటలకు... ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సంఘటనలో పోలీసులు అలాగే మావోయిస్టులు ఎదురెదురు కాల్పులు జరుపుకున్నారు. ఈ తరుణంలోనే మావోయిస్టులు ఏకంగా ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఇటు పోలీసుల్లో ఒక అధికారి  మరణించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారులు కూడా అధికారికంగా ధ్రువీకరించారు.


ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా  అబూజమడ్ అనే గ్రామంలో గత రెండు రోజుల నుంచి ఎన్కౌంటర్... జరుగుతున్నట్లు అక్కడ స్థానిక అధికారి, భాస్కర్ ఐజి సుందర్ రాజ్ వివరించారు. అంతర్ జిల్లాల యాంటీ నక్సల్స్   దళాలు కుమ్మింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో.. ఈ ఎదురు కాల్పులు జరిగినట్లు అధికారులు వివరించారు. ఇదే నేపథ్యంలో 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సుందర్రాజు చెప్పారు.


తమ అధికారి ఒకరు మరణించాడు అని వివరించారు. ఇక మృతదేహాలను.... స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టు మార్టం నిమిత్తం... తరలించినట్లు చెబుతున్నారు. కాగా ఈ విషయం తెలియడంతో మావోయిస్టులు... పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు. 8 మందిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని... పోలీసులపై నిప్పులు జరుగుతున్నారు. ప్రజల కోసం పోరాడే తమని ఇలాచంపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు మావోయిస్టులు. 8 మంది మావోయిస్టులను చంపిన పోలీసులకు తగిన బుద్ది చెబుతామని మావోయిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇక అటు 8 మం ది మావోయిస్టులకు నివాళులు అర్పించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: