జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని పెట్టి పదేళ్లు అయినప్పటికీ ఎట్టకేలకు తాను అనుకున్న చోటుకు చేరుకోగలిగారు. ముఖ్యంగా అధికారం ఇస్తే తాను ఏంటో చూపిస్తానని ఎప్పుడు చెప్పిన చెప్పేవారు పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు ఆ అవకాశం టిడిపి తరఫునుంచి రానే వచ్చేసింది. ఆయన మీద చంద్రబాబు కరుణ కటాక్షలు కూడా రోజురోజుకి ఎక్కువగానే కురిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు చాలా కీలకమైన పదవి కూడా అప్పగించారు.పంచాయతీరాజ్ అన్నది చాలా ప్రధానమైనది. అలాగే గ్రామీణ అభివృద్ధి పర్యటన అడవులు అంటే ఉప శాఖలతో పవన్ కళ్యాణ్ కి మంచి అవకాశం లభించినది.ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేతిలో ఉండే శాఖలు నిత్యం ప్రజలతో ముడిపడి ఉండేవే ఏపీలో నూటికి 70 శాతం మంది గ్రామీణ ప్రాంతం నుంచి ఉండేవారు ఉండడంతో పవన్ కి ఆ పని చాలానే ఉంటుందని చెప్పవచ్చు. పంచాయతీరాజ్ అంటే కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం అయ్యి అక్కడ నుంచి నిధులు తెచ్చుకొని మరి అభివృద్ధి చేయవలసి ఉంటుంది.. ముఖ్యంగా గ్రామాలలో తాగునీరు రోడ్లు సదుపాయాలు గ్రామ స్వరాజ్యం తెచ్చే కీలకమైన అంశాలు కూడా పవన్ కళ్యాణ్ కిందికి వస్తాయట.


క్షణం తీరిక లేకుండా చేయవలసి ఉంటుంది. ఎక్కువగా అనుభవం ఉన్నవారికి ఉమ్మడి ఏపీలో ఈ పోస్టులను ఇచ్చేవారట గతంలో దివాకర్ రెడ్డి విభజన అనంతరం అయ్యన్నపాత్రుడు.. వైసీపీలో బూడి ముత్యాల నాయుడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ శాఖలను చూసేవారు ఇలా ఎంత ప్రాముఖ్యత కలిగిన ఈ శాఖలను చంద్రబాబు పవన్ కి ఇచ్చారు. మరి పవన్ చేతికి ప్రతిరోజు పని ఉండనే ఉంటుంది. మరొకవైపు ఆయన సినిమాలు ఇంకా షూటింగ్ కొన్ని జరిగేవి కూడా ఉన్నాయి. ఈ సినిమాలన్నీ పూర్తి చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రజలకు పూర్తిగా పరిమితమవుతారా లేకపోతే రెండు మెయింటైన్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉన్నది. మరి ఈ బాధ్యతలను పవన్ మోయగలరా లేదా చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: