ఏపీ రాష్ట్ర చరిత్రను పరిశీలిస్తే కమ్మ, కాపు సామాజికవర్గ ఓటర్లు ఏ ఒక్క పార్టీకి సంపూర్ణ మద్దతు ఇవ్వలేదు. కానీ 2024 ఎన్నికల్లో తొలిసారిగా టీడీపీ-జేఎస్పీ-బీజేపీ కూటమికి పూర్తిగా మద్దతు పలికారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి 164 సీట్లతో చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఇది ఒక కమ్మ కాపు సామాజిక వర్గ ప్రజలు ఓటు వేయడం కారణంగానే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ ఓటర్లలో ఒక్క సామాజిక వర్గం వైసీపీకి ఓటు చేసినా టీడీపీ ఇంత పెద్ద అఖండ విజయం సాధించి ఉండకపోయేది.

సాధారణంగా వైఎస్ కుటుంబానికి అండగా నిలిచే రాజకీయ విశ్లేషకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా ఏపీ 2024 ఎన్నికలపై తన విశ్లేషణను పంచుకున్నారు. కమ్మ, కాపు వర్గాల సహకారం వల్లే ఈ ఏడాది ఎన్నికల్లో జగన్ ఓటమి పాలయ్యారని ఆయన అన్నారు. కమ్మ, కాపు ఓట్లు కూటమికి మారడం చాలా ఆశ్చర్యకరమైన పరిణామం అని, అందుకే కూటమి 90% సీట్లతో గెలిచిందని అన్నారు. "కమ్మ, కాపు ఒక శక్తివంతమైన కలయికను తయారు చేస్తారు, దాన్ని జగన్ చూడలేదు. పొత్తు ద్వారా పవన్, బాబు ఆయనను మించిపోయారు." అని కామెంట్ చేశారు.

ఇక జగన్ పార్టీ క్యాడర్‌ను విస్మరించి కేవలం ప్రభుత్వ ఉద్యోగులైన వాలంటీర్లపైనే ఆధారపడ్డారని ఉండవల్లి విశ్లేషించారు. సోషల్ ఇంజినీరింగ్‌లో జగన్ ఫెయిల్ అయ్యారని ఆయన గుర్తు చేశారు. అలానే, జగన్ చంద్రబాబును అరెస్టు చేయడాన్ని ప్రజలు ప్రతీకార చర్యగా చూసారని, ప్రజల్లో చాలాసార్లు క్రియేట్ అయ్యిందని, ఇది జగన్‌కు భారీ ఎదురుదెబ్బ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ముందు చంద్రబాబును జగన్ అరెస్టు చేయించడం చాలా తప్పుడు నిర్ణయం అని ప్రముఖ జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులు, వైసీపీ సానుభూతిపరులు ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ చేసింది ఒకటో రెండో కాదు చాలానే తప్పులు చేశారు. బీజేపీ వైసీపీతో కలుద్దామని చూసిన కూడా దానిని ఆయనను నిరాకరించారట. చంద్రబాబు మాత్రం వెంటనే బీజేపీని కలుపుకొని ప్రభుత్వ వ్యవస్థలను బాగా మేనేజ్ చేశారు. జగన్ తనకు ప్రజల మద్దతు ఉంటే చాలని భావించారు. అదే పెద్ద బ్లెండర్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: