- లోకేష్ టార్గెట్‌లో వైసీపీ టాప్ లీడ‌ర్ పెద్దిరెడ్డి
- ఆర్థిక మూలాల‌పై దాడి... గిల‌గిల్లాడాల్సిందే
- కుప్పంలో టార్గెట్ చేసి చిక్కుల్లో ప‌డ్డ వైనం

( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ )

చిత్తూరు జిల్లా పుంగ‌నూరు ఎమ్మెల్యే, వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ప‌రిస్థితి ఇప్పుడు ఇబ్బందుల్లో ప‌డిపోయింది. ఆయ‌న అధికారంలో ఉన్న‌స‌మ‌యంలో టీడీపీ కార్య‌క‌ర్త‌లు, ముఖ్య నాయ‌కు ల‌పై త‌ప్పుడు కేసులు పెట్టించి.. పోలీసుల‌తో కొట్టించి.. మ‌రీ జైళ్ల‌కు పంపించార‌ని పార్టీ నాయ‌కులు ప‌దే ప‌దే చెప్పిన విష‌యం తెలిసిందే. ఇక‌, చంద్ర‌బాబును కూడా ఆయ‌న టార్గెట్ చేశారు. చంద్ర‌బాబును అంగ‌ళ్ల ప్రాంతంలో అడ్డుకోవ‌డం.. క‌నీసం నియోజ‌క‌వ‌ర్గంలోకి రాకుండా చేయ‌డం తెల‌సిందే.


ఇక‌, చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలోనూ ఆయ‌న‌ను ఓడిస్తాన‌ని ప‌ట్టు బ‌ట్టారు. ఈ క్ర‌మంలో కుప్పంలోని కీల‌క నేత‌ల‌ను కూడా.. పార్టీ మారేలా ప్రోత్స‌హించారు. దీంతో ఒకానొక ద‌శ‌లో టీడీపీ చివురు టాకులా వ‌ణికి పోయింది. అయితే.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు కాబ‌ట్టి.. ఇప్పుడు ప‌రిస్థితి తిర‌గ‌బ డింది. పెద్దిరెడ్డి ప్ర‌తిప‌క్షంలోకి మారారు. ఆయ‌న‌కు ద‌న్నుగా ఉన్న పోలీసులను ఇప్ప‌టికే అక్క‌డి నుంచి పంపేశారు. ఇక‌, ఇక్క‌డి నుంచి ఆయ‌న‌ను వేటాడ‌టం ప్రారంభం కానుంది.


చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఇప్పుడే ఏర్ప‌డిన ద‌రిమిలా .. కొంత స‌మ‌యం తీసుకున్న‌ప్ప‌టికీ.. పెద్దిరెడ్డి ఆర్థిక మూలాల‌పై మాత్రం పెద్ద ఎత్తున దాడి చేసే అవ‌కాశం ఉంది. గ‌నులు.. భూముల వ్య‌వ‌హారంలో పెద్దిరెడ్డి పై అనేక ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇక‌, ఇసుక క్వారీల కుంభ‌కోణం.. పెద్ద ఎత్తున ఆస్తులు సంపాయించుకో వడంపైనా టీడీపీప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించే అవ‌కాశం ఉంది. గ‌తంలో టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను ఎలా అయితే.. లాగేసుకున్నారో.. ఇప్పుడు పెద్దిరెడ్డి అనుచ‌రుల‌ను కూడా టార్గెట్ చేయ‌నున్నారు.


ముఖ్యంగామంత్రి నారా లోకేష్ ఇప్ప‌టికే ఒక గ్రాఫ్ ప్రిపేర్ చేసుకున్నారు. ఆయ‌న త‌న ప్ర‌చారంలో పాపాల పెద్దిరెడ్డి అంటూ వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో పెద్దిరెడ్డి చేసిన పాపాల‌ను నారా లోకేష్ రాసిపెట్టుకున్నారు. పార్టీ ప‌రంగా.. ప్ర‌భుత్వ ప‌రంగా ఆయ‌న చేసిన ప్ర‌తిప‌నినీ టార్గెట్ చేస్తూ.. న్యాయ ప‌రంగా, చ‌ట్ట ప‌రంగా పెద్దిరెడ్డిని ఇరుకున పెట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అయితే.. దీనికి కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: