రాజకీయాలలో రాణించాలంటే అదృష్టం తో పాటు స్థిరత్వం, పార్టీ పట్ల నమ్మకం, నాయకునిపై  విశ్వాసం కలిగి ఉండాలి. ఈ లక్షణాలు లేకపోవడంతో  రాజకీయాల్లో నష్టపోయిన వారు చాలా మంది ఉన్నారు. పార్టీ పై నమ్మకంతో నాయకునిపై విశ్వాసంతో ఉన్న వారు ఎప్పటికైనా రాణిస్తారనేది అంద‌రికీ తెలిసిందే. నెల్లూరు జిల్లాలో వరుసగా ఓటమి చెందుతూ వచ్చిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈసారి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు.


పార్టీకి విధేయుడై ఉండటంతో అన్నిసార్లు పోటీ చేసే అవకాశం లభించింది. ఫ‌లితంగా ఇప్పుడు కాలం క‌లిసి వ‌చ్చిన సోమిరెడ్డి విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఇప్పుడు ఈ తరహాలో స్థిరత్వం లేకపోవ డంతో కీల‌క నాయ‌కుడు చలమలశెట్టి సునీల్ ఓటమి చెందుతూ వచ్చారు. 2009 నుంచి ఆయ‌న పోటీ చేస్తూనే ఉన్నారు. కానీ, పోటీ చేసిన ప్ర‌తిసారీ ఆయ‌న ఓడిపోతున్నారు. ఓటమి చెందినప్పుడల్లా పార్టీ మారి అధికార పార్టీలోకి వచ్చారు. ఈయన దురదృష్టం ఏమోగానీ వీడిన పార్టీ అధికారంలోకి వచ్చేది.


తాజాగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో వైసిపి పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు జంపింగ్ లు రాయబారాలు మొదలుపెట్టారు. టిడిపి నాయకులతో ఉన్న సన్నిహిత్యం, పరిచయాలు ఉన్న వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. అధికార పార్టీ నాయకుడిని ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా మంచి సెంటర్లలో రెండు ఫ్లెక్సీలు వేసి ఒక పూల బొకే పట్టుకొని తయారైపోతున్నారు. అధికారం లేకపోతే నెల రోజులు కూడా ఆగలేనటువంటి వారికి అవకాశం కల్పించవ‌ద్ద‌నే వాద‌న వినిపిస్తోంది.


తాజాగా వైసీపీ త‌ర‌ఫున కాకినాడ నుంచి ఓడిపోయిన‌.. చెల‌మ‌ల శెట్టి సునీల్ అప్పుడే టీడీపీ వైపు దృష్టి పెట్టారు. తాను పార్టీలోకి వ‌చ్చేస్తాన‌ని ఆయ‌న క‌బురు పెట్టారు. ఆర్థికంగా బ‌లంగా ఉండ‌డంతో ఆయ‌నను చేర్చుకునేందుకు పార్టీ రెడీ అవుతుందా?  లేక‌.. ఇప్ప‌టికే ఒక‌సారిపార్టీలోకి వ‌చ్చి.. త‌ర్వాత మ‌ళ్లీ వెళ్లిపోయాడ‌నే కార‌ణంగా.. ప‌క్క‌న పెడుతుందో చూడాలి.  ప్ర‌స్తుతం సునీల్ వ్య‌వ‌హారం.. క్షేత్ర‌స్థాయిలో చ‌ర్చ‌గా మారింది. అత్యంత ముఖ్య నాయ‌కుడిగా ద్వారా ఆయ‌న పార్టీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబుకు రాయ‌బారం పంపిన‌ట్టు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: