మందుబాబులకు తాజాగా ఒక బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది. అదేమిటంటే తెలంగాణ పోలీసులు కీలకమైన ఉత్తర్వులను జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇకపైన బహిరంగ ప్రదేశాలలో నిర్మానుష ప్రాంతాలలో సైతం మందు తాగే వారి పైన కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా తెలంగాణ పోలీసులు ప్రజలకు వార్నింగ్ ఇస్తోంది.. గత కొన్నేళ్ళ నుంచి మందుబాబులు ఎక్కడైనా మరుగు ప్రాంతం కనిపిస్తే చాలు అక్కడికి వెళ్లి తాగేసి అక్కడే పడేసి వెళ్ళిపోతున్నారు. అయితే తాగిన వాళ్లు ఊరుకునే ఉండకుండా ఏదో ఒక సమస్య సృష్టిస్తూ ఉన్నారు.


దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి ఇలా తాగి న్యూసెన్స్ ను క్రియేట్ చేస్తే ఇకపైన వారికి ఆరు నెలలు జైలు శిక్ష ఉంటుంది అంటూ తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు.. అసలు మద్యపానమే ఆరోగ్యానికి హానికరమని మరి అలాంటిది తప్ప తాగి రోడ్డు మీద రచ్చ చేస్తే ఇక అంతే సంగతులు అని తెలుస్తోంది. మందుబాబులు ఎవరైనా సరే మందు తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్లి తాగాలని లేకపోతే ఏదైనా బారులో కూర్చొని మాత్రమే తాగాలి అంటూ పోలీసులు ఉత్తరేణి జారీ చేశారు.


అలా కాకుండా ఏదైనా బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగుతూ కనిపిస్తే మాత్రం ఆరు నెలలు జైలు శిక్ష ఉంటుందంటూ తెలంగాణ పోలీసులు అధికారికంగా తమ ట్విట్టర్ ఖాతాలో నుంచి ఒక పోస్ట్ని షేర్ చేశారు. ఇలా బహిరంగ ప్రదేశాలలో లిక్కర్ తాగడం చట్టరీత్యా నేరమని ఇలాంటి పనులు చేస్తే చుట్టుపక్కల నివసించే వారికి కూడా చాలా ఇబ్బంది ఎదురవుతోందని ఇక మీద రోడ్లమీద కాలి ప్రాంతాలలో ఎవరైనా మద్యం సేవిస్తే వారి మీద కఠినమైన చర్యలు ఉంటాయని అలాగే ఎవరైనా తాగుతూ ఇలా కనిపిస్తే 100కు డయల్ చేయాలని ప్రజలకు తెలియజేస్తున్నామని తెలియజేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. మరి ఇక మీదైనా మందుబాబులు ఇలాంటి పనులు చేయకుండా ఉంటేనే మంచిది లేకపోతే జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: