సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ అయితే ఎక్కువగా వ్యాపారవేత్తలను, రాజకీయ నాయకులను, సినీ సెలబ్రిటీలను మాత్రం వివాహం చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పొలిటికల్ లీడర్లను వివాహం చేసుకోవడం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సొంత పార్టీ పెట్టి ముఖ్యమంత్రిగా చేసి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న హరాదనపల్లి దేవా గౌడ్ కుమారస్వామి కన్నడ రాజకీయాలలో బాగా సుపరిచితుడు. అయితే ఈయన భార్య టాలీవుడ్ హీరోయిన్ అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అందం అభినయంతో ఈ ముద్దుగుమ్మ ఎన్నో చిత్రాలలో నటించింది. మరి ఆమె ఎవరో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
 

కుమారస్వామి భార్య పేరు రాధిక కుమారస్వామి.. ఈమె పలు సినిమాలలో హీరోయిన్గా నటించినది. కన్నడ సినీ పరిశ్రమలో హీరోయిన్గా కూడా నటించింది. ఈ ముద్దుగుమ్మ 2000 సంవత్సరంలో చిన్న వయసులోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తన మొదటి సినిమా చేస్తున్న సమయంలో ఈమె కేవలం  9వ తరగతి చదువుతున్నదట. కన్నడ భాషలో వరుస సినిమాలు చేసిన తర్వాత తమిళంలో కూడా పలు సినిమాలను నటించింది. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి దివంగత నటుడు తారకరత్న నటించిన భద్రాద్రి రాముడు సినిమాలో నటించింది. 2004లో ఈ సినిమా విడుదలై పర్వాలేదు అనిపించుకుంది.


ఆ తర్వాత అవతారం అనే సినిమాలో నటించిన తర్వాత మరే సినిమాలో కూడా నటించలేదు .2018 వరకు సినిమాలు చేసిన ఈమె సినీ ఇండస్ట్రీకి ఒక్కసారిగా దూరమైంది. అలాగే రాధిక రెండు సినిమాలను నిర్మించిన కూడా సక్సెస్ కాలేక పోయిందట .అయితే పొలిటికల్ లీడర్ కుమారస్వామి రాధిక వివాహం చేసుకుంది. అప్పటికే ఆయనకు అనిత కుమారస్వామి తో వివాహం అయ్యింది. అయినప్పటికీ కూడా రాధిక కుమారస్వామి రెండో వివాహం   చేసుకుంది. అంతకు ముందు ఆమె రతన్ మార్క్ ను వివాహ చేసుకొందట. కొన్ని కారణాల చేత విడిపోయినట్టు సమాచారం. ఈ విషయం వైరల్ గా మారడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: