పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి పదేళ్లు అయినప్పటికీ తన పోరాట ఫలితం ఈ ఎన్నికలలో ఫలించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల తరఫున పోట్లాడి రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు. దీంతో వెనకడుగు వేయకుండా పట్టు వదలని విక్రమార్కుడులా పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికలలో పోటీ చేశారు. ప్రజలు తనని అంగీకరించడం జరిగింది.రాజకీయాల నుంచి వెనక్కి తగ్గని పవన్ కళ్యాణ్ మూడోసారి ఎన్నికలలో తిరుగులేని మెజారిటీతో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బిజెపి, టీడీపీ కూటమితో కలిసి పోటీ చేసిన స్థానాలన్నీ కూడా గెలిచారు.


దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో 21 స్థానాలలో బరిలో దిగిన జనసేన పార్టీ అన్నిట్లోనూ విజయం సాధించింది దీంతో డిప్యూటీ సీఎం హోదా కూడా కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ అందుకున్నారు. ఈ మేరకు ఆయన ప్రమాణస్వీకారానికి కూడా చేయడం జరిగింది. 19వ తేదీన జనసేనకి సంబంధించి బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు తెలుస్తోంది. అనంతరం జనసేన పనితీరు పైన ప్రజలు చాలా ఉత్కంఠంగా ఎదురు చేస్తున్నారు. ఈనెల 12వ తేదీన చంద్రబాబు నాయుడు తన మంత్రులతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సహ 24 మందిని ప్రమాణస్వీకారం చేయించారు.


24 మందికి పలు రకాల శాఖల బాధ్యతలను కూడా కేటాయించారు. పవన్ కళ్యాణ్ కి నాలుగు శాఖలు అప్పగించారు పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా ,అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణ శాఖను కూడా అప్పగించడం జరిగింది. అలాగే నాదెండ్ల మనోహర్ కు పౌరసరఫరాల శాఖ వినియోగదారుల వ్యవహారాలను కూడా అప్పగించారు. అలాగే మరొక మంత్రి కందుల దుర్గేష్ కు కూడా పర్యటక శాఖ మంత్రి, సినిమాటోగ్రఫీ శాఖలు సైతం అప్పగించారు. పవన్ కళ్యాణ్ ఈనెల 19వ తేదీ నుంచి తన బాధ్యతలను సైతం నెరవేర్చే విధంగా అడుగులు వేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: