- నో క‌రప్ష‌న్‌.. నో కాంట్ర‌వ‌ర్సీ.. విన‌సొంపైన స‌బ్జెక్టున్న నేత‌
- సీమ‌లో కుర‌బ‌ల ప్రాధాన్యం పెంచే ప్లాన్‌లో కాల్వ‌కు షాక్‌
- బోయ‌ల‌కు ఛాన్స్ ఇస్తే కాల్వ ఈ సారి మంత్రైన‌ట్టే

( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ )

కాల్వ శ్రీనివాసులు. న‌మ్ర‌త‌కు, విధేయ‌త‌కు నిలువెత్తు రూపం. అధినేత మాట జ‌వ‌దాట‌ని నాయ‌కుడిగా ఎదిగిన ఉన్న‌త విద్యావంతుడు. ఒక‌ప్ప‌టి పాత్రికేయుడు. నోటి నుంచి వ‌చ్చే మాట‌కు కొల‌త‌లు వేసుకుని .. ప్ర‌తి వాక్యాన్నీ.. అక్ష‌ర సుంద‌రంగా విన‌సొంపుగా స‌బ్జెక్టును మాత్ర‌మే మాట్లాడే నిబ‌ద్ధ‌త ఉన్న నాయ‌కు డు. కానీ.. ఆయ‌న‌కు ఇప్పుడు చంద్ర‌బాబు మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్క‌లేదు. 2014-19 మ‌ధ్య మంత్రిగా చేసిన కాల్వ‌.. ఒక మంత్రి ఎలా ఉండాలో నిరూపించారు.


అవినీతి.. అక్ర‌మాలు.. దౌర్జ‌న్యాలు అనే మంత్రి త‌ర‌హా కొన్ని అవ‌ల‌క్ష‌ణాల‌ను ఆయ‌న విదిలించుకున్నా రు. చీద‌రించుకుని మ‌రీ.. స‌మున్న‌త విలువ‌లు నేర్పించారు. తాజాగా రాయ‌దుర్గం నుంచి మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకున్నారు. గ‌తంలో ఎంపీగా.. త‌ర్వాత‌.. మంత్రిగా నాయకుడికి నిఘంటువుగా నిలిచారు. ముఖ్యంగా టీడీపీలో ఒక స‌మున్న‌త నేత‌గా ఎదిగారు. ఆయ‌న ఎవ‌రిని చూసి నేర్చుకున్నారో.. తెలియ‌దు కానీ, ఆయ‌న‌ను చూసి నేటి త‌రం నాయ‌కులు నేర్చుకునే స్థాయికి చేరుకున్నారు.


చంద్ర‌బాబు చెప్పింది వేదం. కూర్చోమంటే కూర్చుంటారు. కాదంటే.. నిల‌బ‌డే ఉంటారు. అంత‌టి నిబ‌ద్ధ‌త‌.. అధినేత ప‌ట్ల విధేయ‌త‌ల‌ను సొంతం చేసుకున్నా.. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని కురబ సామాజిక వ‌ర్గం బ‌లాన్ని పార్టీకి ఆయుధంగా మ‌లుచుకునే ప్ర‌క్రియ‌లో భాగంగా చంద్ర‌బాబు ఈ సారి కాల్ప‌ను ప‌క్క‌కు త‌ప్పించారు. బోయ సామాజిక వ‌ర్గానికి చెందిన కాల్వ‌.. గ‌తంలో మంత్రిగా ప‌నిచేసి.. ఆప‌ద‌వికి కొత్త నిర్వ‌చ‌నం జోడించారు.


కానీ.. ఈ సామాజిక వ‌ర్గం కంటే.. కూడా కుర‌వ సామాజిక వ‌ర్గం పెరుగుద‌ల‌.. జ‌నాభా ప‌రంగా వారు విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో కుర‌బ‌ల‌కు చంద్ర‌బాబు ప్రాధాన్యం ఇవ్వ‌క త‌ప్ప‌లేదు. ఈ నేప‌థ్యంలోనే పెనుకొండ నుంచి తొలివిజ‌యం అందుకున్న స‌విత‌కు అవ‌కాశం ఇచ్చారు. ఫ‌లితంగా.. కాల్వ‌ను ప‌క్క‌న పెట్టారు. అయితే.. రెండేళ్ల త‌ర్వాతైనా.. ఆయ‌న‌కు అవ‌కాశం చిక్క‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు టీడీపీ సీనియ‌ర్లు. ఎందుకంటే.. ఆయ‌న త‌త్వం.. వ్య‌క్తిత్వం అలాంటివి మ‌రి!!

మరింత సమాచారం తెలుసుకోండి: