టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు గొప్ప అవ‌కాశం చిక్కింది. ఒక‌ప్పుడు కేంద్రంపై మ‌నం ఆధార‌ప‌డి ఉండా ల్సిన స్థాయి నుంచి ప్ర‌జ‌లు ఇప్పుడు.. కేంద్ర‌మే మ‌న‌పై ఆధార‌ప‌డి ఉండే ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ నేప థ్యంలో సీఎం చంద్ర‌బాబు ఎలా వ్య‌వ‌హరిస్తార‌నే విష‌యంపై ఆస‌క్తి నెల‌కొంది. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలకే కాదు.. పొరుగు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు కూడా ఆయ‌న పెద్ద పీట వేసే అవ‌కాశం ఉంటుంద‌ని తెలుస్తోంది. ఏపీ స‌హాతెలంగాణ‌ల్లోనూ టీడీపీని విస్త‌రించాల‌ని చంద్ర‌బాబు చూస్తున్నారు.


ఏపీలో అత్యంత బ‌లంగా టీడీపీ ఎదిగిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే 134 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుంది. ఇప్పుడు చంద్ర‌బాబు త‌న బ్రాండును వేయాలంటే.. కేంద్రం నుంచి ఉదారంగా నిధు లు తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంది. త‌ద్వారా.. పోల‌వ‌రం ప్రాజెక్టునుత న హ‌యాంలోనే కంప్లీట్ చేస్తే.. అటు ఉభ‌య గోదావ‌రులు స‌హా..ఉత్త‌రాంధ్ర‌లోనూ పార్టీకి తిరుగులేకుండా ఉంటుంది. ఇక‌, ఇదేస‌మ‌యంలో వ‌చ్చే ఐదేళ్లు కూడా.. రాజ‌ధానికి అత్యంత కీల‌క స‌మ‌యం.


ఎందుకంటే.. 2014-19 మ‌ధ్య రాజ‌ధానిగా చంద్ర‌బాబు అమ‌రావ‌తిని ఎంపిక చేశారు. కానీ, ఆయ‌న పూర్తి చేయ‌లేక‌పోయార‌నే వాద‌న వినిపించింది. త‌ర్వాత‌..వ‌చ్చిన వైసీపీ ప్ర‌భుత్వం రాజ‌ధానితో ఫుడ్ బాల్ ఆడేసుకుంది.దీంతో ప్ర‌జ‌లు కూడా విసిగిపోయారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు చంద్ర‌బాబుక‌నుక దీనిని ముందుకు తీసుకువెళ్తే.. ఖ‌చ్చితంగా పూర్తి చేయ‌గ‌లిగితే.. ఆయ‌న‌కుత తిరుగు ఉండ‌దు. అయితే.. దీనికి కూడా.. కేంద్రం నుంచి సహాయ స‌హ‌కారాలు అత్యంత‌కీల‌కం.


ఇక‌, ఈ ప్రాజెక్టుల‌తోపాటు మ‌రిన్ని ప్రాజెక్టుల‌ను కూడా చంద్ర‌బాబు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇదిలా వుంటే.. ఏపీకి మాత్ర‌మే కాదు.. తెలంగాణ‌లోనూ టీడీపీని విస్త‌రించాల్సి ఉన్న నేప‌థ్యంలో  అక్క‌డి ప్ర‌యో జ‌నాల‌ను కూడా.. కేంద్రంతోమాట్లాడి సాధిస్తే.. త‌న కేంద్ర మంత్రుల‌ను అక్క డ చ‌క్రం తిప్పేలా వినియో గించుకుంటే.. చంద్ర‌బాబు ఇంటా బ‌య‌టా కూడా.. సక్సెస్ కావ‌డం పెద్ద స‌మ‌స్య కాదనే భావ‌న ఉంది. అయితే.. దీనికి కావాల్సింది.. ఓర్పు.. ప్ర‌ణాళిక‌.. వ్యూహం. మ‌రి చంద్ర‌బాబుఎలా సాధిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: