•  చంద్రబాబు మంత్రివర్గంలో ఫస్ట్ టైమ్‌ మంత్రులైన నేతలు ఎందరో

* అందరికంటే ఎక్కువ అదృష్టం సతీష్ కుమార్ యాదవ్‌కే

* ఫస్ట్ టైమ్‌లోనే జాక్‌పాట్ కొట్టేశాడు

(ఏపీ - ఇండియా హెరాల్డ్)

ఏపీ రాజకీయ నాయకుడు సత్య కుమార్ యాదవ్ 2024 అసెంబ్లీ ఎన్నికలలో ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య మంత్రి అయ్యారు. ఆయన మంత్రి కావడం మొదటిసారి. సత్య కుమార్ బీజేపీ సభ్యుడు.

2024లో అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా సత్యకుమార్‌ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన 3,734 ఓట్ల స్వల్ప తేడాతో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై గెలుపొందారు. జూన్ 12న చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణం చేశారు. మొదటిసారి ఎమ్మెల్యే కావడంతో పాటు మొదటిసారి అత్యంత కీలకమైన ఆరోగ్యశాఖ మంత్రి అయ్యారు. బీజేపీ నుంచి ఆయన ఒక్కరే మంత్రివర్గంలో చోటు సంపాదించారు. బీజేపీ గెలుచుకుంది మొత్తము 8 సీట్లు అందులో ఈయన మంత్రి కావడం విశేషం. అంతేకాదు చాలామంది సీనియర్ నేతలు తనకు కావాల్సిన నాయకులు ఉన్న సరే సత్యకుమార్‌ యాదవ్ కే అత్యంత కీలకమైన హెల్త్ మినిస్ట్రీని ఇచ్చి చంద్రబాబు ఆశ్చర్యపరిచారు. టీడీపీలో చాలా కాలంగా ఉంటూ విశేష సేవలందించిన వారిని పక్కన పెట్టి ఈ బీజేపీ నేతకు మట్టం కట్టడం విశేషం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలానే కష్టపడ్డారు 21 సీట్లను గెలుచుకున్నారు. పార్టీ వారిలో ముగ్గురుని మంత్రులను చేశారు కానీ ఆ శాఖలు ఆరోగ్యశాఖతో పోల్చితే చాలా తక్కువవి.

ఇకపోతే 1993లో, సత్య కుమార్ ఎం. వెంకయ్య నాయుడుకు వ్యక్తిగత సహాయకుడిగా తన వృత్తిని ప్రారంభించారు.  ఆపై ప్రైవేట్ సెక్రటరీ, అడిషనల్ ప్రైవేట్ సెక్రటరీ, సీనియర్ ప్రైవేట్ సెక్రటరీతో సహా వివిధ పాత్రలలో పనిచేశాడు. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు కొంతకాలం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD)గా కూడా పనిచేశారు. 2021లో, సత్య కుమార్ రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు, బీజేపీలో చేరి 2018లో పార్టీ జాతీయ కార్యదర్శిగా నియమితుడయ్యారు.అతను కేరళ, కర్ణాటక ఎన్నికలను పర్యవేక్షించడంలో పాలుపంచుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌కు జాయింట్ ఇన్‌చార్జ్, అండమాన్‌లో బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా కూడా పని చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: