2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి 164 సీట్లతో విజయం సాధించింది. 11 సీట్లలో వైసీపీ నెగ్గింది. ఈ సీట్లలో వైసీపీ మోస్ట్ పాపులర్ నేతలు గెలిచారు. ఈ వైసీపీ విజేతలలో దాసరి సుధ వంటి మామూలు పొలిటిషన్లు కూడా ఉన్నారు. బద్వేలులో వైసీపీ రాజకీయ నాయకురాలు దాసరి సుధ 18,567 ఓట్ల మెజార్టీతో బీజేపీ నేత బొజ్జ రోశన్నపై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కడపలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉంటే టీడీపీ కూటమి ఐదింట విజయం సాధించగలిగింది. అందులో ఒకటి పులివెందుల కాగా మరొకటి బద్వేలు. పులివెందుల జగన్ కి కంచుకోట కాబట్టి అక్కడ వేరే పార్టీ గెలవడం అసాధ్యం కానీ బద్వేలులో ఓడిపోవడమే టీడీపీకి షాక్ లాగా తగిలింది.

రాష్ట్రం అంతటా అన్ని జిల్లాలలో క్లీన్ స్వీప్‌ చేయగలిగిన టీడీపీ కడపలో మాత్రం రెండు స్థానాలను కోల్పోయింది. బద్వేలు టీడీపీ ఇన్చార్జి విజయమ్మ చేసిన తప్పుల వల్లే పార్టీ ఓడిపోయిందని సొంత పార్టీ వాళ్లే నిందిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఓటమికి కర్త, కర్మ, క్రియ ఆమే అని తమ్ముళ్లు షాకింగ్ ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీకి కేటాయించిన సీటును అనుచరుడికి ఇప్పించారు ఆమె. కానీ గెలిపించుకోలేకపోయారు. ఈ నియోజకవర్గంలో టిడిపికి బలమైన కేడర్ ఉంది కానీ విజయమ్మ సొంత నిర్ణయాలతో సమన్వయ లోపాలకు దారి తీశారు. ఆమె కుమారుడు, విజయమ్మ ఇద్దరూ కలిసి ఒంటెద్దు పోకడలతో కింది స్థాయి కేడర్ ను కలుపుకోకుండా ప్రవర్తిస్తున్నారట. ఆమె వల్లే ప్రతిసారి ఇక్కడ ఓటమి ఎదురవుతుందని బద్వేల్ తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ అధిష్టానం కూడా ఈ అపజయాన్ని సీరియస్ గా తీసుకోనుందట. అంతేకాదు విజయమ్మను ఇన్చార్జి పదవి నుంచి తొలగించి వేరే వారిని నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. విజయమ్మ ఎవరి సూచనలను కూడా పట్టించుకోరాట అందుకే ఇక్కడ పార్టీ వీక్ అయిందని అంటున్నారు. వీరారెడ్డికి విజయమ్మ కూతురు అవుతారు. ఆయన బతికున్నప్పుడు పార్టీని గెలిపించగలిగారు. ఆయన చనిపోయాక విజయమ్మ పార్టీ పగ్గాలని చేపట్టారు కానీ తప్పుడు నిర్ణయాలతో గెలిపించలేకపోతున్నారు. ఎస్సీ రిజర్వుడ్ కావడంతో ఆమె ఇన్చార్జిగా పదేళ్లు పనిచేస్తూ వచ్చారు. బలోపేతం చేయడానికి కష్టపడ్డారట కానీ ఆమె వల్ల పార్టీ పతనం అయ్యిందని టిడిపి వాళ్ళు ఆరోపిస్తున్నారు. చూడాలి మరి ఆమెపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: