రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు హాట్ హాట్గా కొనసాగుతున్నాయి. ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో... పదవుల పంపకాలు కూడా  చాలా జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే 24 మందికి మంత్రి పదవులు దక్కగా... త్వరలోనే స్పీకర్ పదవులను కూడా భర్తీ చేయనున్నారు చంద్రబాబు. ఇటు కార్పొరేషన్ పదవులను కూడా భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
 

అయితే ఏపీలో ఉన్న బిజెపి నేతలకు...  కీలక పదవులు ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం కూడా రంగం సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పదవి ఇవ్వడానికి... సిద్ధమైందట  కేంద్ర ప్రభుత్వం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో... స్పీకర్ గా, అలాగే ముఖ్యమంత్రిగా పనిచేసిన అపార అనుభవం కిరణ్ కుమార్ రెడ్డికి ఉంది.రాయలసీమలో వైసీపీ వీకైన నేపథ్యంలో... రెడ్డిలకు మంచి పదవులు ఇవ్వాలని బిజెపి కూడా ఆలోచన చేస్తోoదట. ఇందులో భాగంగానే... కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ గవర్నర్ పదవి ఇవ్వాలని... మోడీ టీం భావిస్తుందట. మొన్న లోక్ సభ ఎన్నికల్లో.... రాజంపేట నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు. దీంతో తెలంగాణ గవర్నర్గా పంపించేందుకు... కిరణ్ కుమార్ ను సిద్ధం చేస్తున్నారట.

 

మొత్తం తెలంగాణకు పూర్తిస్థాయిలో గవర్నర్ ఎవరు లేరు.. ప్రస్తుతం ఉన్న సీపీ రాధాకృష్ణన్... ఇన్చార్జి గవర్నర్ మాత్రమే. ఆయన జార్ఖండ్ కు మళ్ళీ వెళ్ళిపోతారు. దీంతో అక్కడ పూర్తిస్థాయిలో గవర్నర్గా కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టాలని ఆలోచన చేస్తున్నారట. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... గులాబీ పార్టీ సోషల్ మీడియా రచ్చ చేస్తుంది. తెలంగాణ ఉద్యమ కాలంలో.. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను  అన్న కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పదవి ఇస్తే... ఊరుకునేది లేదని కెసిఆర్ పార్టీ ఫైర్ అవుతోంది. ఏపీ చెందిన నేతలు ఇక్కడ అవసరం లేదని బీజేపీని టార్గెట్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: