ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమిని  ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. జగన్ తన పథకాల్లో 90 శాతం పూర్తిచేసినా ప్రజలు నమ్మలేదు. చివరికి వీరికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా టీడీపీకే ఓట్లు వేశారు. ఇంతటి విఫలానికి కారణం జగన్మోహన్ రెడ్డే అని చెప్పవచ్చు. ఆయన కేవలం సీఎం అయ్యాననే అహంకారం తప్ప కిందిస్థాయిలో నాయకులు ఎలా ఉన్నారు వారు ప్రజలకు ఎలా దగ్గరవుతున్నారనేది ఏనాడు తెలుసుకోలేదు. చివరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు,ఎమ్మెల్యేలు,ఇతర మండల నాయకుల వల్ల కార్యకర్తలు,ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారట. అంతేకాదు ఒక్కసారి అధికారంలోకి వచ్చాక జగన్ కింద ఉండే నాయకులంతా టిడిపి వారిని తిట్టిన తిట్టు తిట్టకుండా చాలా విమర్శించి వారి అహాన్ని హార్ట్ చేశారు. ఈ విధంగా నిండుకుండలా ఉండేటువంటి వైసీపీ పార్టీని పూర్తిగా నీళ్లు లేకుండా చేశారు.

 ప్రస్తుతం ఆ నాయకులంతా ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ ఆ నాయకులంతా వైసిపి పార్టీని పట్టుకొని ఉందామనుకుంటున్నారట.  వారు అలాగే ఉంటే మాత్రం ఆ కుండ కూడా పూర్తిగా పగిలిపోతుంది. ఇదే తరుణంలో 45% ఓట్ల షేరింగ్ ఉన్నటువంటి వైసీపీ నాయకత్వం జగనన్నను తీవ్రంగా విమర్శిస్తున్నారట. పార్టీలో ఉండేటువంటి దొంగ నాయకులందరినీ తొందరగా బయటకు పంపించేయండి. కొత్త నాయకత్వాన్ని మనం నిర్మించుకుందాం. మరో ఎన్నికల వరకు  వైసిపిని గట్టి శక్తిగా తయారు చేసుకుందామని అంటున్నారట. ముఖ్యంగా ఆ పార్టీలో ఉండేటటువంటి కొడాలి నాని,  వల్లభనేని వంశీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి, రోజా వీరికి మంత్రి స్థాయి పదవులు ఇవ్వడంతో  అహంకారం పెరిగిపోయి కనీసం వైసీపీ కార్యకర్తలతో సరైన సంబంధాలు పెట్టుకోకుండా వేధింపులకు గురి చేశారట.

ఇక ప్రజలను కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టారట. అంతే కాకుండా టిడిపిలో ఉన్న నాయకులను అలాగే ఉండనివ్వకుండా  వారిని తరచూ గెలుకుతూ  ప్రజల్లోకి వచ్చేలా చేశారని చెప్పవచ్చు. ఈ విధంగా టిడిపి నాయకుల అహాన్ని హర్ట్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారకులయ్యారు. మరి ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి గమనించి  తనకు ఉన్నటువంటి ఓట్ షేరింగ్ కార్యకర్తలను కాపాడుకోవాలంటే అలాంటి నాయకులందరినీ పార్టీ నుంచి బయటకు పంపిస్తేనే బాగుంటుందని కార్యకర్తలు, వైసిపి అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారట.  ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇది గమనించుకొని పార్టీని భవిష్యత్తులో ఉండే విధంగా కాపాడుకుంటారా లేదంటే వారిని పార్టీలో ఉంచుకొని పార్టీని పాతర పెడతారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: