జగన్‌ పాలన కట్టిన రుషికొండ ప్యాలెస్‌ గురించి టీడీపీ చేస్తున్న రచ్చపై కౌంటర్‌ ఇచ్చేందుకు గుడివాడ అమర్‌నాథ్ రంగంలోకి దిగారు. రుషికొండపై ఉన్న ప్రభుత్వ కట్టడాలపై టిడిపి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా ఫైర్‌ అయ్యారు. సీఎం జగన్ సొంత భవనాల్లగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు గుడివాడ. రుషికొండ భావనలపై వాస్తవాలను ప్రజలను గమనించాలని కోరిన గుడివాడ అమర్‌నాథ్... నాలుగు నెలలు క్రితమే రుషికొండ భవనాలను ప్రారంభించామన్నారు.


ప్రారంభించిన భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేయాలని... రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ విశాఖ వచ్చిన సందర్భంలో రుషికొండ భావనలను వినియోగించుకోవాలని సూచనలు చేశారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో అందరికీ తెలుసు అంటూ చురకలు అంటించారు గుడివాడ అమర్‌నాథ్. రుషికొండ పై ఉన్నవి ప్రభుత్వ భవనాలు అని టిడిపి నేతలు గుర్తించాలని.. గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణలను గంటా శ్రీనివాసరావు చూపిస్తే బాగుండేదని అంటూ కౌంటర్‌ ఇచ్చారు.


గతంలో అమరావతిలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ కి చదరపు అడుగుకు 10 వేలు ఖర్చు పెట్టగా లేని అభ్యంతరం ఈ భావనాలకు ఎందుకు వచ్చిందని నిలదీశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో హైద్రాబాదు లో స్టార్ హోటల్ లో ఉంటూ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసింది మర్చిపోయారా? అంటూ ఫైర్‌ అయ్యారు. విశాఖ రాజధానిని స్వాగతించిన గంటా కు నగరంలో ఒక్క ప్రభుత్వ అతిధి గృహం కూడా లేదన్న విషయం తెలియదా? అంటూ నిలదీశారు. స్థానిక శాసనసభ్యుడిగా రుషికొండ ఎదురుగా 25 ఎకరాలు ఆక్రమించుకున్న గీతం యూనివర్సిటీ కి గంటా ఎందుకు తీసుకెళ్ళలేదని ప్రశ్నించారు.

ప్రభుత్వం పై ఆరునెలలు విమర్శలు చేయకూడదని అనుకున్నా టీడీపీ నేతలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహించారు. కోడెల శివప్రసాద్ సామాగ్రి తరలింపు కు, మాజీ ముఖ్యమంత్రి జగన్ క్యాంప్ కార్యాలయ సామాగ్రి కి పోలికే లేదని క్లారిటీ ఇచ్చారు గుడివాడ. ముఖ్యమంత్రి గా నివాసం ఉన్నారు కాబట్టి ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు, ఫర్నిచర్ కు డబ్బులు కట్టేందుకు సిద్ధంగా ఉన్నామని లేఖ రాశామన్నారు గుడివాడ అమర్‌నాథ్.

మరింత సమాచారం తెలుసుకోండి: