ఆంధ్రప్రదేశ్లోని బెజవాడ రాజకీయం ఇప్పుడు మరొకసారి హాట్ టాపిక్ గా మారింది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది నేతలు చంద్రబాబు మాటలను పట్టించుకోకుండా నానా హంగామా సృష్టిస్తున్నారు. ఇప్పుడు తాజాగా విజయవాడతో సహా పలు ప్రాంతాలలో రాజకీయ ఉద్రిక్తతలు మరొకసారి చోటు చేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశి ఇంటి వద్ద గత వారం రోజులకు ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు సైతం మెగా పెట్టి ఆయన ఇంటి వైపు వాహనాలు వెళ్లకుండా చూసుకుంటున్నారు.


తాజాగా విజయవాడ శివారు సింగ్ నగర్ ఏరియాలో ఒకప్పటి టిడిపి కార్పొరేటర్ ప్రస్తుతం వైసీపీ నాయకుడు సందేపు జగదీష్ కు సంబంధించిన ఇంటిని సైతం నిన్నటి రోజున మున్సిపాలిటీ అధికారులు కూల్చివేయడం జరిగింది.. పోలీసులను రంగంలోకి దింపి వ్యాపార సముదాయాన్ని నేలమట్ట చేశారు. దీంతో అక్కడ రాజకీయ వాతావరణ మరొకసారి వేడి రాజుకుంది. అయితే దీని వెనక టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమా ఉన్నారని ఆరోపిస్తూ ఉన్నారు. జగదీశ్ తన కుటుంబంతో సహా నిరసనని వ్యక్తం చేస్తూ ఇలాంటి కక్ష రాజకీయాలు చేయవద్దంటూ ఆరోపించారు.

ఈ సందర్భంగా ప్రకాష్ నగర్ లో తన ఇంటి ముందే కూర్చొని శిరోమండనం చేయించుకున్నారు.. తన కుటుంబ సభ్యులు కూడా పక్కనే ఉండడంతో పాటు తన భార్యకు కూడా శిరోమండనం చేయించబోతూ ఉండగా పోలీసుల సైతం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జగదీష్ కు పోలీసులకు మధ్య వాగ్దానం చోటుచేసుకుంది. బోండా ఉమా దాదాగిరి ఎక్కువైంది అంటూ మండిపడ్డారు. తన భవనాన్ని జెసిబిల సహాయంతో పగలగొట్టారని గతంలో తాను టిడిపిలో ఉన్నప్పుడు ఈ భవనానికి ప్రోత్సహించారని అలాంటిది ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఉంటుందా అంటూ ఆయన నిలదీశారు.. అధికారం ఈరోజు టిడిపి ది కావచ్చు రేపు వైసీపీ ది కావచ్చు కానీ ఇలాంటి కక్షపూరితమైన రాజకీయాలు చేయడం తగువున అంటూ ఫైర్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: