*నిరుద్యోగులకు అండగా కూటమి ప్రభుత్వం
*సూపర్ సిక్స్ లో భాగంగా యువతకు రూ. 20 లక్షల ఉపాధి అవకాశాలు
*నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు సత్వర చర్యలు  

ఆంద్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కూటమి అఖండ విజయం సాధించింది.కూటమిలో భాగంగా తెలుగు దేశం పార్టీ ఏకంగా 134 అసెంబ్లీ స్థానాలు గెలిచి అఖండ విజయం సాధించింది.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసారు.అలాగే గురువారం సచివాలయంలో ఐదు ఫైల్స్‌కు సంబంధించి సంతకాలు చేశారు. ఎన్నికల హామీల్లో భాగంగా మెగా డిఎస్సీ, ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు హామీలు తీవ్ర ప్రభావం చూపాయి.చంద్రబాబు ఎన్నికలలో ఇచ్చిన భారీ హామీలు సూపర్‌ సిక్స్ పధకాలు.ఈ పధకాల విషయంపై అధికారులతో చర్చించి అమలుకు చర్యలు తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.అయితే ముఖ్య మంత్రిగా భాద్యతలు తీసుకున్నచంద్రబాబుమొదటి సంతకాన్ని మెగా డిఎస్సీపై చేయడం విశేషం. రెండో సంతకం ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దుపై చేశారు. మూడో సంతకం పింఛన్‌ల పెంపుపై చేశారు. నాలుగో సంతకం అన్నక్యాంటిన్ల పునరుద్దరణ అలాగే ఐదో సంతకం స్కిల్ సెన్సెస్పై చేశారు.
 
మెగా డిఎస్సీపై మొదటి సంతకం చేయడంతో నిరుద్యోగులు ఎంతో సంతోషంగా వున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్‌సీపై సంతకం చేశారు.అలాగే రాష్ట్రంలోని నిరుద్యోగులకు అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.సూపర్ సిక్స్ లో భాగంగా యువతకు రూ. 20 లక్షల ఉపాధి అవకాశాలు, లేదా నెలకు రూ. 3000లు నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారు.ఉద్యోగ కల్పనే ద్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది.త్వరలోనే రాష్ట్రంలోకి భారీగా పెట్టుబడులు రాబట్టేవిధంగా చర్యలు తీసుకుంటామని ఐటి శాఖ మంత్రి నారాలోకేష్ తెలిపారు.యువతకు ఉద్యోగాలను కల్పించి తీరుతామని హామీ ఇచ్చారు.అలాగే ఈ ప్రాసెస్ లేట్ అయ్యే కొద్దీ అభ్యర్థులు నష్టపోకుండా నెలకు ౩౦౦౦ చొప్పున నిరుద్యోగ భృతిని అందిస్తామని తెలిపారు.త్వరలోనే ఈ హామీలను అమలు చేస్తామని లోకేష్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: