- సీఎం అయ్యాడో లేదో సోమ‌వారం పోల‌వ‌రం ప్రారంభం
- అప్పుడే అమ‌రావ‌తి ఉరుకులు ప‌రుగులే
- కేంద్రం నిధుల‌పై స్పెష‌ల్ ఫోక‌స్‌

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

టీడీపీ అధినేత‌, ఏపీ నూత‌న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సీఎంగా ప్ర‌మాణం చేసిన వారంలోనేప‌ని ప్రారంభించారు. ప‌ద‌వుల పంప‌కాలు.. మంత్రి వ‌ర్గ ఏర్పాటు, అధికారుల‌తో స‌మీక్ష‌లు పూర్త‌యిన ద‌రిమిలా.. ఇప్పుడు ఆయ‌న పూర్తిస్థాయిలో ప‌నిపై దృష్టి పెట్టారు. వాస్త‌వానికి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే ఐదు ఫైళ్ల‌పై సంత‌కాలు చేసి.. ప‌నిని అప్పుడే ప్రారంభించారు. అయితే.. అది ఇన్ డోర్ ప‌నికావ‌డం గ‌మ‌నార్హం.


దీంతో ఇప్పుడు ఔట్ డోర్ ప‌నిని కూడా.. చంద్ర‌బాబు కేవ‌లం వారంలోనే ప్రారంభించారు. సోమ‌వారం సోమ‌వారం.. ఆయ‌న పోల‌వ‌రం ప్రాజెక్టు కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అలా అనుకోవ‌డ‌మే త‌రువా యి అన్న‌ట్టుగా.. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం చేసిన త‌ర్వాత‌.. వ‌చ్చిన తొలి సోమ‌వారే ప‌నిప్రారంభించారు.  తాజాగా పోల‌వ‌రం ప‌ర్య‌ట‌న చేయ‌నున్నారు. ఇక‌, ఇక్క‌డ నుంచే చంద్ర‌బాబు త‌న మార్కు పాల‌న‌ను మ‌రోసారి ప్ర‌జ‌ల‌కు రుచి చూపించ‌నున్నారు.


పోల‌వ‌రం త‌ర్వాత ప్రాధాన్యాల్లో అమ‌రావ‌తి రాజ‌దాని నిర్మాణం ఉంది. దీనికి కూడా చంద్ర‌బాబు ఇప్ప‌టి కే కొన్ని సూచ‌న‌లు చేశారు. అయితే.. మంగ‌ళ‌వారం నుంచి ఆయ‌న అమ‌రావ‌తిపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్ట‌నున్న‌ట్టు అధికార వ‌ర్గాలు తెలిపాయి. రైతుల‌తో సంప్ర‌దింపులు.. గ‌త ఐదేళ్ల కింద‌ట క‌ట్టించిన నిర్మాణాల ప్ర‌గ‌తి.. వాటిని ఏ విధంగా ర‌క్షించుకోవాల‌న్న అంశంపై.. చంద్ర‌బాబు దృష్టి పెడుతున్నారు. ఇప్ప‌టికే అమ‌రావ‌తికి సంబంధించిన‌.. ప‌లు అంశాల‌పై చంద్ర‌బాబు నిపుణుల‌తో నివేదిక‌లు తెప్పించుకున్నారు.


అదే స‌మ‌యంలో భోగాపురం విమానాశ్ర‌యం పూర్తిపైనా వ‌చ్చే వారంలో చంద్ర‌బాబు చ‌ర్చించ‌నున్నారు. కేంద్రవిమాన యాన శాఖ మంత్రిగా టీడీపీ యువ నాయకుడు కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడు ఉన్న నేప‌థ్యంలో ఈ ప‌నులు వ‌చ్చే రెండేళ్ల‌లోనే పూర్తిచేయాల‌ని చంద్ర‌బాబు ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఇక‌, క‌డ‌ప ఉక్కు ఫ్యాక్ట‌రీ.. విష‌యాన్ని కూడా వ‌చ్చే వారంలో పూర్తిస్థాయిలో పట్టాలెక్కించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. ప‌నిని ప్రారంభించ‌డ‌మే కాదు.. ప‌రుగులు పెట్టిస్తున్నార‌న‌డానికి ఇవి ఉదాహ‌ర‌ణ‌లుగా నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: