ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు భద్రత పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో  అలానే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వై ప్లస్ సెక్యూరిటీని  అధికారులు అందిస్తున్నారు. వై ప్లస్  సెక్యూరిటీ అందించడమే కాకుండా... మరింత భద్రత పెంచేందుకు సిద్ధమైంది చంద్రబాబు సర్కార్.


అటు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు... కట్టుదిట్టమైన భద్రతతో పాటు ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారు కూడా కేటాయించింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ మేరకు అధికారిక ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. పవన్ కళ్యాణ్  పై ఈగ కూడా వాలకుండా చూసుకోవాలని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు అధికారులకు ఇచ్చారట. సాధారణంగా.. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్టాలీవుడ్ స్టార్ హీరో.


ఈ తరుణంలో పవన్ కళ్యాణ్  చూసేందుకు చాలా మంది ఎగబడతారు. మొన్నటి వరకు ఒక లెక్క... ఇప్పుడు మరొక లెక్క. పవన్ కళ్యాణ్ ను టచ్ కూడా  చేయని పరిస్థితులు ఇప్పుడు ఉంటాయి. ఇది ఇలా ఉండగా తెలుగుదేశం కూటమి విజయానికి  పవన్ కళ్యాణ్ చేసిన కృషి అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్ కారణంగానే చంద్రబాబు అలాగే...  మోడీ ఒకటి కాగలిగారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు... కూటమికి విత్తనం వేసింది పవన్ కళ్యాణ్.


దాని ఫలితంగానే 164 సీట్లతో.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. ఇటు జనసేన పార్టీ కూడా 100% స్ట్రైక్ రేట్ తో... దంచి కొట్టింది. ఈ దెబ్బకు... జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటిసారిగా ఎమ్మెల్యే కూడా అయ్యారు. ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా.. ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా అయ్యారు.  ఇక రేపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా.. బాధ్యతలు కూడా తీసుకోనున్నారు పవన్ కళ్యాణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: