ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలకు ముందు టిడిపి ప్రభుత్వం వైసిపి పాలన వచ్చిన తర్వాత నిత్యవసర ధరలు పెరిగిపోయాయని పలు రకాల వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిత్యవసర ధరలు పెరగడానికి ముఖ్య కారణం జగనే అంటూ ఎన్నికల ముందు వరకు విస్తృతంగా ప్రచారం కూడా చేసింది. సంక్షేమ పథకాలకు డబ్బులు కావాలని నిత్యవసర ధరకులను జగన్ ప్రభుత్వమే పెంచేసింది అంటూ ప్రచారం చేశారు. దీంతో ప్రజలు కూడా చాలా మంది నమ్మడం జరిగింది. ఈ ప్రచారంలో జగన్ ప్రభుత్వం పై అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించారని చెప్ప వచ్చు


ఈ నేపద్యంలోని ఎన్నికల ఫలితాలు తర్వాత టిడిపి ప్రభుత్వం కూటమి ఆధారంగా 164 సీట్లు తగ్గించుకుంది. అలాగే కూరగాయ ధరలు పెంచడం కూడా చర్చనీయాంశంగా మారింది. గత నెలలో టమోటా 20 నుంచి 25 ఉండగా.. ఇప్పుడు ధర ఐదింతలు పెరిగింది . మొన్నటివరకు ఉల్లికూడా వంద రూపాయలకు మూడు కిలోలు ఉండగా ఇప్పుడు మూడు కిలోలు కొనాలి అంటే 200 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఇవే కాకుండా చాలా కూరగాయలు కూడా ధరలు పెరిగిపోయాయి అలాగే ఈ సరుకులు తీసుకున్న కూడా ఆకాశాన్ని ధరలు దాటుతున్నాయి.


ప్రస్తుతం వంటింటి ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. గతంలో అంటే కూరగాయల ధరలు సరుకు ధరలు పెరగడానికి ముఖ్య కారణం జగన్ అని టిడిపి పార్టీ నేతలు విమర్శించారు. మరి ఇప్పుడు జగన్ ప్రభుత్వం దిగిపోయింది కదా తమ ప్రభుత్వమే అధికారం వచ్చింది మరి ధరలు ఎందుకు తగ్గడం లేదు అంటూ ప్రభుత్వాన్ని సైతం కొంతమంది నేతలు ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఇలాంటి ధరల పెరుగుదల పాపం ఎవరిమీదికి నెట్టివేస్తారో చూడాలి మరి. అయితే ఇప్పటికే రేషన్ షాపుల్లో కూడా టిడిపి ప్రభుత్వం కందిపప్పు నూనె తో పాటు ఇతర వాటిని కూడా పంపిణీ చేసేలా ప్లాన్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: