ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందుకోలేని ఘనత ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దక్కించుకున్నారు. పడ్డ చోటే నిలబడాలని... భీష్మించుకుని... కూర్చున్న పవన్ కళ్యాణ్... సక్సెస్ రేట్ తో దూసుకెళ్తున్నాడు. ముఖ్యంగా... ఏపీలో ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా... మంత్రి పదవికి కూడా చేపట్టాడు పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్.... అమరావతి రైతుల మనసు కూడా గెలుచుకున్నాడు.


చంద్రబాబు కంటే ఎక్కువగా ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆరాధిస్తున్నారు అమరావతి రైతులు. ఇందులో భాగంగానే ఏకంగా 29 గ్రామాల అమరావతి రైతులు... పవన్ కళ్యాణ్ కోసం గ్రాండ్గా  ప్లాన్ చేస్తున్నారు. పూల వర్షం చెల్లి... పవన్ కళ్యాణ్ కు  స్వాగతం పలకాలని  నిర్ణయం తీసుకున్నారు అమరావతి రైతులు.  మూడు రాజధానిల పేరుతో... జగన్మోహన్ రెడ్డి... ముందుకు వెళితే... అమరావతి రైతులు మాత్రం జగన్ను రిజెక్ట్ చేశారు.


ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అమరావతికి వచ్చిన... ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు, నిరసన సెగలు తగిలేవి. కానీ... పవన్ కళ్యాణ్ మాత్రం... అమరావతి రైతుల కోసం పనిచేశారు. తెలుగుదేశం కూటమి ఏర్పాటుకు ముందుండి నడిపించారు పవన్ కళ్యాణ్. దింతో అప్పటినుంచి పవన్ కళ్యాణ్ ను ఆరాధించడం మొదలుపెట్టారు అమరావతి రైతులు. ఇందులో భాగంగానే డిప్యూటీ ముఖ్యమంత్రిగా... అమరావతికి వస్తున్న నేపథ్యంలో.. పవన్ కళ్యాణ్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమవుతున్నారు అమరావతి రైతులు.


ముఖ్యంగా వెంకటాపాలెం వద్ద నుంచీ సచివాలయం వరకూ అమరావతి రైతులు సంబరాలు ప్రారంభించేశారు. రోడ్లపై పసుపు పచ్చని పూలు చల్లుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ కు స్వాగతం పలికేందుకు సిద్ధం చేస్తున్నారు అమరావతి రైతులు. అంతేకాదు... భారీ క్రేన్ తో పూల మాలను సిద్ధం చేస్తున్నారు రైతులు. పవన్ కళ్యాణ్ ను ర్యాలీగా వెంకటపాలెం నుంచీ సచివాలయం వరకూ తీసుకెళ్ళనున్నారు రైతులు. అమరావతి రాజధానిని కాపాడటం, తెలుగుదేశం కూటమి విజయానికి ముఖ్య కారణం ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని భావిస్తున్న రైతులు...ఆయనకు స్వాగతం పలుకుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: