రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, శాశ్వ‌త మిత్రులు ఉండ‌ర‌ని అంటారు. అవ‌కాశం-అవ‌స‌రం.. అనే రెండు ప‌ట్టాల‌పైనే నాయ‌కులు, పార్టీలు కూడా ప‌య‌నిస్తాయి. ఈ విష‌యంలో ఏ పార్టీ కూడా త‌క్కువ తిన‌లేదు. ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ నుంచి జ‌న‌సేన‌లోకి,, వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన నాయ‌కులు ఉన్నారు. కానీ.. గ‌త ఐదేళ్ల‌లో అవే పార్టీల‌ను తిట్టిపోశారు. అయినా.. రాజ‌కీయ అవ‌స‌రాలు.. ఇటు పార్టీల‌కు.. అటు నాయ‌కుల‌కు కూడా కామ‌న్ కావ‌డంతో అంద‌రూ స‌ర్దుకుపోయారు.


ఇప్పుడు ఇదే ప‌రిస్థితి వైసీపీకి కూడా ఎదురు కానుంది. ఇప్ప‌టికే ప‌లువురు నాయ‌కులు పార్టీకి రాజీనామా లు చేశారు. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ నుంచి గ‌త 2019 ఎన్నిక‌ల త‌ర్వాత‌..వ‌చ్చివైసీపీ జెండా మోసిన శిద్దారాఘ‌వ‌రావు పార్టీకి రాజీనామా చేశారు. అదేవిధంగా మ‌రికొంద‌రు కూడా.. రాజీనామాలు స‌మ‌ర్పించా రు. ఇక‌, ఇప్పుడు వైసీపీకి విశ్వాస పాత్ర‌మైన నాయ‌కురాలు, జ‌గ‌న్ హ‌యాంలో ఎన‌లేని గుర్తింపు తెచ్చుకు న్న నేత‌.. విడుద‌ల ర‌జ‌నీ కూడా.. ఇదే బాట‌లో ఉన్నార‌ని తెలుస్తోంది.


2019 ఎన్నిక‌ల‌కు ముందు రాజ‌కీయ అరంగేట్రం చేసిన ర‌జ‌నీ.. తొలుత టీడీపీలో చేరారు. అయితే..తాను కోరుకున్న టికెట్ రాక‌పోయే స‌రికి వెంట‌నే ప్లేట్ ఫిరాయించి.. వైసీపీలో చేరి.. చిల‌కలూరి పేట టికెట్ ద‌క్కింకున్నారు. ఆ వెంట‌నే విజ‌యంసాధించారు. త‌ర్వాత రెండేళ్ల‌కు జ‌గ‌న్‌కేబినెట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయ్యారు. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో మాత్రం జ‌గ‌న్ ఆమెను చిల‌క‌లూరి పేట నుంచి గుంటూరు వెస్ట్‌నియోజ‌క‌వ‌ర్గానికి మార్చారు. ఇక్క‌డ మాత్రం ఆమె ఓడిపోయారు.


రాజకీయాల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మే అనుకున్నా.. వైసీపీలో స‌మీప కాలంలో భ‌విష్య‌త్తు క‌నిపించ డం లేదని ఆమె భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో ఓట‌మి త‌ర్వాత నుంచి ఆమె క‌నిపించ‌డం మానేశారు. పార్టీ నాయ‌కుల‌కు కూడా.. అందుబాటులోకి రాలేదు. దీంతో పార్టీనేత‌లు నిశితంగా ఆరా తీయ‌గా.. విడ‌ద‌ల ర‌జ‌నీ.. గుంటూరులో కాకుండా.. ఢిల్లీలో మ‌కాం వేసిన‌ట్టు తెలుసుకున్నారు. అంతేకాదు.. బీజేపీలో చేరేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నార‌ని స‌మాచారం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: