ఏపీలో ఎన్నిక‌లు ముగిశాయి. కూట‌మి ప్ర‌భుత్వం క‌నివినీ ఎరుగ‌ని రీతిలో అప్ర‌తిహ‌త విజ‌యం సాధించి అధికారంలోకి వ‌చ్చింది. ముఖ్య‌మంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌మాణ స్వీకారం చేశారు. త్వ‌ర‌లోనే అసెంబ్లీ స‌మావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉంటే నిన్న‌టి వ‌ర‌కు తిరుగులేని మెజార్టీతో అధికారంలో ఉన్న వైసీపీ ఈ సారి కేవ‌లం 11 సీట్ల‌కే ప‌రిమితం అయ్యింది. ఆ పార్టీకి కేవ‌లం 11 సీట్లు మాత్ర‌మే వ‌చ్చాయంటే అది మామూలు అవ‌మానం కాద‌నే చెప్పాలి. ఇక వైసీపీకి నాలుగు లోక్ స‌భ సీట్లు కూడా వ‌చ్చాయి.

అర‌కు తో పాటు తిరుప‌తి, రాజంపేట‌, క‌డ‌ప ఎంపీ సీట్ల‌ను వైసీపీ గెలుచుకుంది. అయితే ఇప్పుడు వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల ల‌తో పాటు ఒక ఎంపీ పార్టీ మారి ప‌సుపు కండువా క‌ప్పుకునేందుకు రెడీ అవుతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. పార్టీ పూర్తిగా డీలా ప‌డిపోయింది. ఐదేళ్ల పాటు ఎలాంటి బ‌లం లేకుండా ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేగా .. అది కూడా బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం కాదు.. అస‌లు ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తారో లేదో కూడా తెలియ‌ని పార్టీలో ఉండ‌డం కంటే.. అధికార పార్టీ పంచెన చేరితే కొంత వ‌ర‌కు అయినా నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేసుకోవ‌డంతో పాటు ఐదేళ్ల పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేగా హ‌వా చెలాయించ‌వ‌చ్చ‌ని లేక‌పోతే ఐదేళ్లు ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేగా గోళ్లు గిల్లు కోవ‌డం.. కాల‌యాప‌న చేయ‌డం మిన‌హా చేసేదేం ఉండ‌ద‌న్న నిర్ణ‌యానికి కొంద‌రు ఎమ్మెల్యేలు వ‌చ్చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఇక పార్టీ మారేందుకు ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేల‌తో పాటు ఒక ఎంపీ కూడా ఉన్న‌ట్టు పేర్లు ప్ర‌చారంలో ఉన్నాయి. పార్టీ మారే జాబితాలో క‌ర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి తో పాటు విశాఖ ఏజెన్సీ లో అర‌కు ఎమ్మెల్యే రేగం మ‌త్స్యలింగం , పాడేరు ఎమ్మెల్యే మ‌త్స‌ర‌స విశ్వేశ్వ‌ర రాజు, అర‌కు ఎంపీ చెట్టి త‌నూజా రాణి పేర్లు జంపింగ్ జాబితాలో వినిపిస్తున్నాయి. వీరంతా కూడా ఐదేళ్లు వైసీపీలో .. అందులోనూ ఎలాంటి ప్రాధాన్య‌త లేకుండా ఎంపీ, ఎమ్మెల్యేగా ఉండ‌డం అన‌వ‌స‌రం అన్న నిర్ణ‌యానికి వ‌చ్చేశార‌ని.. వీరు పార్టీ మార్పు చ‌ర్చ‌ల్లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: