రాజ‌న్న పాలన తీసుకువ‌చ్చేందుకే నేను వ‌చ్చా` అంటూ.. సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల స‌మ‌యంలో గొంతెత్తి గ‌ర్జించి.. అన్న ప్ర‌భు త్వం కుప్ప‌కూల‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హరించిన కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌, వైఎస్ త‌న‌య ష‌ర్మిల ఎక్క‌డున్నారు?  ఏం చేస్తున్నారు? అనేది ఆస‌క్తిగా మారింది. ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఆమె అమెరికా వెళ్లారు. త‌ర్వాత ఇండియాకు వ‌చ్చారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు బ‌హిరంగ వేదిక‌పై క‌నిపించ‌లేదు. మ‌రోవైపు గురువారం నుంచి పార్టీ స‌మీక్ష‌లు ప్రారంభ‌మ‌వుతున్నాయి. ఏయే ప్రాంతంలో పార్టీ ఎందుకు ఓడింద‌నే విష‌యంపై భూత‌ద్దంలో వెత‌క‌నున్నారు. దీనికి సంబంధించి ప్ర‌క‌ట‌న కూడా ఇచ్చారు.


అయితే.. ష‌ర్మిల విష‌యంలో నాడు(అంటే.. ఎన్నిక‌ల‌కు ముందు ఫిబ్ర‌వ‌రి-మే మ‌ధ్య‌) ఉన్న ఇమేజ్ నేడు ఉందా? అనేది మిలి య‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న. ఎందుకంటే.. విజ‌య‌వాడ‌కు చెందిన సుంక‌ర ప‌ద్మ‌శ్రీవంటివారు.. ష‌ర్మిల నాయ‌క‌త్వాన్ని ఎన్నిక‌ల త‌ర్వాత తూర్పార బ‌ట్టారు. ష‌ర్మిల కార‌ణంగానే కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ప‌రాజ‌యం పాలైంద‌ని వ్యాఖ్యానించారు. ఆమె విధానాల‌ను కూడా సుంక‌ర విమ‌ర్శించారు. ఏక‌ఛ‌త్రాధి ప‌త్యంగా ముందుకు వెళ్లార‌ని.. కేవ‌లం జ‌గ‌న్‌ను టార్గెట్ చేసుకుని.. పొరుగు పార్టీల‌కు మేలు చేశార‌ని కూడా ప‌ద్మ‌శ్రీ జూన్ 5న తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించి.. మీడియా ముందే క‌న్నీరు పెట్టుకున్నారు.


ఇక‌, సీమ ప్రాంతానికి చెందిన రెడ్డి సామాజిక వ‌ర్గం కూడా.. ష‌ర్మిల నాయ‌క‌త్వాన్ని వ్య‌తిరేకిస్తోంది. ఆమె వ‌ల్ల రెడ్లంతా సంఘ టితం అవుతార‌ని భావించిన ఈ వ‌ర్గం.. గెలుపుపై ఆశ‌లు పెట్టుకుంది. రెడ్డి సామాజిక వ‌ర్గం పోటీ చేసిన స్థానాల్లో క‌నీసం 3-4 సీట్ల‌యినా ద‌క్కుతాయ‌ని ఆశించారు. కానీ, ష‌ర్మిల వ్య‌వ‌హార శైలితో రెడ్డి సామాజిక వ‌ర్గం సంఘ‌టితం కాక‌పోగా.. రాజ‌న్న బిడ్డ‌గా కూడా ఆమె విఫ‌ల‌మ‌య్యార‌ని సీమ‌కు చెందిన రెడ్లు ఇప్ప‌టికే ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. నిజానికి ఆదిలో ష‌ర్మిల రాక‌ను పుర‌స్క‌రించుకుని సీమ రెడ్లే సంబ‌రాలు చేసుకున్నారు. ఎన్నిక‌ల‌ప్ర‌చారానికి కూడా త‌మ వంతు ఆర్థిక సాయం అందించారు.


కానీ.. ఇప్పుడు అదేరెడ్డి సామాజిక వ‌ర్గం.. ష‌ర్మిల నాయ‌కత్వాన్ని దూరం పెడుతోంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌చారాన్ని ఏక‌ప‌క్షంగా సాగించార‌ని రెడ్లు కూడా ఆవేద‌న‌, ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇక‌, ఎన్నిక‌లు పూర్తయి.. పార్టీలో ఏ ఒక్క‌రు గెలిచిన సంద‌ర్భం లేనప్పుడు కూడా.. నేరుగా అధిష్టానాన్ని క‌లిసి.. రాష్ట్రంలో ప‌రిస్థితి అంతా బాగుంద‌ని ష‌ర్మిల చెప్ప‌డం.. ఓటు బ్యాంకు పెరిగింద‌ని దానికి తానే కార‌ణ‌మ‌న్న‌ట్టుగా సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీల ముందు చెప్పుకోవ‌డం వంటి వాటిని కూడా.. సీనియ‌ర్లు త‌ప్పుబ‌డుతున్నారు.


నిజానికి ష‌ర్మి ల ప్ర‌భావం ఉండి ఉంటే.. త‌మ‌కు క‌నీసం 5-8 శాతం ఓటు బ్యాంకు పెరిగి ఉండాల‌ని.. కానీ,ఆమెను ఏపీ ప్ర‌జ‌లు వైఎస్ వార‌సురాలిగా గుర్తించ‌లేద‌ని ఓ సీనియ‌ర్ నాయ‌కుడు.. గుంటూరు జిల్లాలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయి నేత వ్యాఖ్యానించారు. అంటే.. నాడు ష‌ర్మిల‌ను నెత్తిన పెట్టుకున్న‌వారే.. నేడు.. వ్య‌తిరేకిస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీనిని బ‌ట్టి ఆమె మారాలా?  లేక పార్టీనే ఆమెను మార్చాలా? అనేది తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: