- చిన్న వయసులోనే కేంద్ర మంత్రి పదవి..
- పార్లమెంటులో పోరాడాడు ఏపీలో చేసి చూపించాడు.
- ఏపీ డెవలప్మెంట్ కు పెద్దపీట వేయడమే లక్ష్యమా.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మార్పు చెందాయి. టిడిపి కూటమి పూర్తిస్థాయి మెజార్టీతో విజయం సాధించింది. పార్లమెంటులో కూడా అద్భుతమైనటువంటి సీట్లు సాధించి దేశ రాజకీయాల్లోనే కింగ్ మేకర్ గా మారింది. అలాంటి టిడిపి నుంచి యంగ్ అండ్ డైనమిక్ ఎంపీగా గెలిచినటువంటి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అద్భుతమైన అభివృద్ధిలో తీసుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా నుంచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించినటువంటి రామ్మోహన్ నాయుడును కేంద్ర ప్రభుత్వం గుర్తించి మంత్రి పదవిని కట్టబెట్టింది. గతంలో ఆయన ప్రత్యేక హోదా, పెండింగ్ సమస్యలు సహా, అనేక సమస్యలపై తన గళాన్ని వినిపించారు. అలాంటి శ్రీకాకుళం జిల్లాలో కింజారపు కుటుంబానికి ఒక మంచి పేరుంది. యువత, సామాజిక తరగతి, విధేయత వంటి అంశాల ప్రకారం ఈయనకు కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించారు. ఈయన అందరితో కలుపుగోలుగా ఉండడం, సమస్యలను లోక్ సభలో ప్రస్తావించడం వంటివి ఎంతో గుర్తింపుని ఇచ్చాయి. ఈయన తండ్రి ఎర్రన్నాయుడు కూడా గతంలో కేంద్ర మంత్రిగా చేశాడు. ఈ కుటుంబం అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎంతో పేరు సంపాదించుకున్నారు. సమస్యలపై లోతైన అవగాహన ఉండడం వల్లే ఈయన హ్యాట్రిక్ విజయం సాధించగలిగాడు. అలాంటి ఈయన 2014, 2019, 2024 ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయన్నాందుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా రామ్మోహన్ నాయుడు మంచి పేరు తెచ్చుకున్నారు. శ్రీకాకుళం లోక్ సభ స్థానాన్ని తన కంచు కోటగా మార్చుకున్నారు. ఈయన తాజా ఎన్నికల్లో 3,27,000 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అయితే ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్నటువంటి టిడిపి కీలక నేతగా ఉన్న రామ్మోహన్ నాయుడుకు ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి విమాన పౌరయాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాంటి ఈయనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆయన ముందున్నటువంటి సవాళ్లు ఏంటి అనేది చూద్దాం.

 రామ్మోహన్ నాయుడు ముందున్న సవాళ్లు:
 ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో తన గళాన్ని వినిపించినటువంటి రామ్మోహన్ నాయుడు, ప్రత్యేక హోదా సాధించే అవకాశం ఉంది. ఎందుకంటే దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే టిడిపి కూటమి, కేంద్ర పెద్దల మెడలు వంచి అయిన  ప్రత్యేక హోదా, రైల్వే జోన్స్ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా  పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న ఈయన భోగాపురం ఎయిర్పోర్టు, రాష్ట్రంలోని ఇతర విమానాశ్రయాలు అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలని అంటున్నారు. దీంతో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి, భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు, పునరావస వసతి, మౌలిక సదుపాయాల వంటి వాటిపై మంత్రి ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను రాష్ట్రానికి మళ్ళించడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.  ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో రామ్మోహన్ నాయుడు కీలక రోల్ పోషిస్తారని ప్రజలంతా ఆశలు పెట్టుకున్నారు.మరి చూడాలి ఈయన హయాంలో ఆంధ్రప్రదేశ్ ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: