పాన్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి.. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఈనెల 27వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఇందులో దీపికా పదుకొనే , దిశాపటానీ ,అమితాబచ్చన్, కమలహాసన్ తదితర నటీనటుడు సైతం నటిస్తూ ఉన్నారు. దాదాపుగా ఈ సినిమా మూడు గంటల నిడివి తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కల్కి సినిమా సెన్సార్ పనులను కూడా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది.. అందరూ అనుకున్నట్టుగానే U/A సర్టిఫికెట్ ని అందుకున్నది.


పాన్ వరల్డ్ మూవీ అంటూ మేకర్స్ ఒక రేంజ్ లో ఒక మంచి భజ్ ను క్రియేట్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా వేగవంతం చేసిన చిత్ర బృందం బుజ్జి అండ్ భైరవ అంటూ ఒక వారం రోజులపాటు హంగామా సృష్టించారు. ముఖ్యంగా బుజ్జి, భైరవ సన్నివేశాలు పిల్లలను బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి. తాజాగా ఫ్రీ సేల్స్ తోనే నార్త్ అమెరికాలో రెండు మిలియన్లకు పైగా డాలర్లను రాబట్టింది. ఈ సినిమాలో అద్భుతమైన విజువల్స్ ఉన్నాయని తెలియజేస్తోంది. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాలో విజువల్స్ ఉన్నట్లుగా సెన్సార్ సభ్యులు కూడా వెల్లడించారు.

ఇండియన్ సినిమాలోని ఇలాంటి విజువల్స్ ఎప్పుడూ కూడా చూడలేదని వారి అభిప్రాయంగా వెల్లడించారు. స్టోరీ లైన్ కూడా మరింత ఇంట్రెస్టింగ్ గా ఉందని యూనిక్  గా ఉందని కచ్చితంగా ఈ సినిమా విజయాన్ని అందుకుంటుందంటూ తెలియజేస్తున్నారు. నటీనటుల నటన విషయానికి వస్తే.. భైరవ పాత్రలు ప్రభాస్ అద్భుతంగా నటించారని సినిమా మొత్తం ఆయన పాత్ర పైనే ఆసక్తి చూపించేలా చేస్తుందంటూ తెలిపారు.


అశ్వద్ధామ పాత్రలో అమితాబచ్చన్ కూడా అద్భుతంగా నటించారని కమలహాసన్ పాత్ర కూడా చాలా ఆకట్టుకునేలా ఉందంటూ వారి అభిప్రాయంగా వెల్లడించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా కాస్త బెటర్ గానే ఉందని సాంగ్స్ మాత్రం సరిగ్గా సెట్ అవ్వలేదని వారి అభిప్రాయంగా తెలియజేస్తున్నారు సెన్సార్ సభ్యులు. సౌత్ ఇండియన్ సినిమాని అబ్బురపరిచే విధంగా ఈ సినిమాలో ఉంటాయని.. అనుకోని అతిధి పాత్రలు ఈ సినిమాలో చాలానే ఉన్నాయని ఎండింగ్లో ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉంటుందంటూ తెలిపారు. ఈ సినిమా 2:55 నిమిషాల నిడివి ఉన్నదట.

మరింత సమాచారం తెలుసుకోండి: