ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో 151 స్థానాలు గెలుచుకున్న వైసీపీ పార్టీ... 2024 సంవత్సరం ఎన్నికలు వచ్చేసరికి... అధికారాన్ని కోల్పోవడమే కాకుండా... ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయే ప్రమాదాన్ని తెచ్చుకుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే దక్కించుకుంది వైసిపి పార్టీ. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఇందులో కీలకమైన నేతలు.

మంత్రులు, మాజీ మంత్రులు, వైసీపీ ఫైర్ బ్రాండ్లు  ఇలా ఎంతోమంది కీలక నేతలందరూ ఈ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. దీంతో జగనన్న ఒంటరి అయిపోయాడు. అయితే వైసీపీ పాలనలో... తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసిన కొంతమంది నేతలు అందరూ... ఇప్పుడు దేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ... విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా మాజీ మంత్రి రోజా కూడా విదేశాలకు వెళ్ళిపోతున్నట్లు సమాచారం. తాజాగా ఎయిర్ పోర్టు  లో ఉన్న ఓ వీడియోను రోజా సోషల్ మీడియాలో పెట్టింది. గుడ్ మార్నింగ్ అంటూ...  ఆ వీడియోలో రోజా మాట్లాడింది. ఆమె వెనకాల... ఎయిర్ పోర్ట్ బ్యాక్ గ్రౌండ్ స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో... రోజా విదేశాలకు వెళ్ళిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె ఓటమి బాధను భరించలేక... విదేశాలకు వెళుతుందని టిడిపి ట్రోలింగ్ చేస్తోంది.

 అయితే మరికొంతమంది వైసీపీ కార్యకర్తలు మాత్రం... ఎన్నికల్లో కష్టపడ్డ రోజా.... కాస్త రిలాక్స్ కోసం విదేశాలకు వెళ్తుందని...అంటున్నారు. ఓటమికి భయపడి బయట దేశాలకు... వెళ్లాల్సిన అవసరం తమకు లేదని... వైసీపీ నేతలు చెబుతున్నారు. కాగా... నగరి నియోజకవర్గంలో రెండు సార్లు విజయం సాధించిన  రోజా... ఈసారి దారుణంగా ఓడిపోయింది. వైసిపి లో ఉన్న కొంతమంది నేతల కారణంగా రోజా ఓడిపోయిందని చెబుతున్నారు. ఇక ఎన్నికల తర్వాత ఎక్కడ కనిపించని రోజా.. ఇప్పుడు విదేశాలకు వెళ్లడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: