గుంటూరు జిల్లాకు చెందిన ప్ర‌ముఖ వైసీపీ మ‌హిళా నాయ‌కురాలు... మాజీ మంత్రి విడదల రజనీ పార్టీ మారిపోతున్నార‌ని.. ఆమె త్వ‌ర‌లోనే బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారం ఒక రేంజ్‌లో న‌డుస్తోంది. ఆమె కొంత మంది బీజేపీ అగ్రనేతల్ని కలిసి పార్టీలో చేర్చుకోవాలని కోరుతున్నట్లుగా కూడా సోష‌ల్ మీడియాలో గ‌ట్టిగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇక్క‌డే మ‌రో ట్విస్ట్ కూడా ఉంది. ర‌జ‌నీ ఇలా లీకులివ్వడానికి కారణం ఉందని.. ఆమె త‌న‌ను టీడీపీలోకి ఆహ్వానిస్తారన్న ప్లాన్ తోనే ఈ లీకుల రాజకీయం చేస్తున్నారని అంటున్నారు.


టీడీపీలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఫ‌లిస్తున్న‌ట్టుగా లేవు. ఇలాంటి నేత‌ల‌ను ఇప్పటికిప్పుడు టీడీపీలో చేర్చుకునేందుకు టీడీపీ నేత‌లు సిద్ధంగా లేరు. అందుకే ఆమె బీజేపీ వైపు చూస్తున్నట్లుగా లీకులిస్తున్నారని కూడా ఆమె గురించి బాగా తెలిసిన రాజ‌కీయ జ‌నాలు గుస‌గుస లాడుకుంటున్నారు. ఇక ర‌జ‌నీ విష‌యానికి వ‌స్తే ఆమె టీడీపీతో రాజ‌కీయం స్టార్ట్ చేశారు. మాజీ మంత్రి పుల్లారావు ద‌య‌తో రాజ‌కీయాల్లో ఎదిగి.. ఆ త‌ర్వాత ఆయ‌న సీటుకే టెండ‌ర్ పెడుతూ చిలుకలూరిపేట టిక్కెట్ ఇవ్వాలని కోరారు. బాబు ఒప్పుకోలేదు.. దీంతో ఆమె  వైసీపీలో చేరారు.


దండిగా డబ్బులు పెట్టే వారి కోసం చూస్తున్న జగన్ వెంటనే ఎమ్మెల్యే సీటు ఇవ్వ‌డం.. ఆమె ఎమ్మెల్యే అవ్వ‌డం.. ఆ వెంట‌నే ఏకంగా వైద్య ఆరోగ్య శాఖా మంత్రి అయిపోవ‌డం.. ఇప్పుడు ఎన్నిక‌ల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోవ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఇప్పుడు ఆమెకు భవిష్యత్ పై భ యమో లేదా టెన్ష‌నో స్టార్ట్ అయ్యిందంటున్నారు. ఆమె మంత్రిగా ఉన్న వైద్య ఆరోగ్య శాఖలో చాలా స్కాంలు జరిగాయ‌ట‌. అయితే వీటి గురించి విడదల రజనీకి తెలిసింది చాలా తక్కువ అయితే... సజ్జల నేతృత్వంలో జ‌రిగిన త‌ప్పులే ఎక్కువ ఉన్నాయంటున్నారు. ఇవ‌న్నీ త‌న మొడ‌కు చుట్టుకుంటాయ‌నే ర‌జ‌నీ టెన్ష‌న్ తో పార్టీ మార్పు దిశ‌గా ఆలోచ‌న చేస్తున్న‌ట్టుగా టాక్ ?

మరింత సమాచారం తెలుసుకోండి: