ఉమ్మడి కడప జిల్లాలోని కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాధవీరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. చాలా సంవత్సరాల తర్వాత కడపలో టీడీపీ జెండా ఎగరడానికి మాధవీరెడ్డి కారణం కావడం గమనార్హం. కడప చరితను మార్చిన ధీర వనిత మాధవీరెడ్డి అని ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆమె గురించి చాలామంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
 
గత ప్రభుత్వ పాలనలో కడప అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ నేతలు భూములను కబ్జా చేసినట్టు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. కబ్జా చేసిన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఆమె వెల్లడించగా కడపలో గత ప్రభుత్వ పాలనలో జరిగిన అరాచకాలకు మాధవీరెడ్డి చెక్ పెడతారా అనే చర్చ జరుగుతోంది. మాధవీరెడ్డి చెప్పిన హామీలను నిలబెట్టుకుంటే మాత్రం కడప ప్రజలు భవిష్యత్తులో కూడా ఆమెను గెలిపించే అవకాశాలు ఉంటాయి.
 
కడప పేరుకు పెద్ద జిల్లా అయినా జిల్లాలో చాలా సమస్యలు ఉన్నా జిల్లాలో ఎన్నికలకు ఆరు నెలల ముందు ఒకే సమయంలో ఆరు సర్కిళ్ల సుందరీకరణ పనులు ఒకే సమయంలో మొదలుపెట్టారు. ఆ సమయంలో రోడ్లపైకి వచ్చిన ప్రజలు నిత్యం నరకం చూశారు. కడపలో డంపింగ్ యార్డ్ మధ్యలో ఉండటం వల్ల కూడా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మాధవీరెడ్డి కడప అసెంబ్లీలో అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఎమ్మెల్యేగా గెలిచారు.
 
మాధవీరెడ్డి భర్త శ్రీనివాసులు రెడ్డికి నియోజకవర్గంలో ఉన్న మంచి పేరు ఆమెకు ప్లస్ అయిందని తెలుస్తొంది. మరోవైపు మాధవీరెడ్డి గెలుపుతో అంజాద్ బాషా రాజకీయ ప్రయాణానికి అంతిమ కార్డు పడినట్లేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గత ఐదేళ్లలో జగన్ సీఎంగా ఉమ్మడి కడప జిల్లాకు చేసిందేం లేదని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. ఐదేళ్ల కూటమి పాలన బాగుంటే భవిష్యత్తులో సైతం ఉమ్మడి కడప జిల్లాలో కూటమికి తిరుగుండదని చెప్పవచ్చు. చంద్రబాబు ఉమ్మడి కడప జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది.
 
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: