- మ‌హిళ‌ల‌కు ఉచిత ఆర్టీసీ బ‌స్సు ప్ర‌యాణం స‌క్సెస్ కొట్టేనా
- సేఫ్ డ్రైవింగ్‌.. రోడ్ సేఫ్టీ ప‌క్కా అమ‌లు చేయాల్సిందే

( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ )

రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రిగా నియ‌మితులైన‌.. రాయ‌చోటి ఎమ్మెల్యే మండ‌ప‌ల్లి రాంప్ర‌సాద్‌రెడ్డికి భ‌విష్య త్తు చాలా బాగుంద‌నే టాక్ వినిపిస్తోంది. రెండు కీలక అంశాల విష‌యంలో ఆయ‌న తీసుకునే నిర్ణ‌యాలు.. వేసే అడుగులు క‌నుక స‌క్సెస్ అయితే.. ఆయ‌న కు పెద్ద క్రెడిట్టే ల‌భిస్తుంద‌ని చెబుతున్నారు. ఒకటి ఎన్నిక‌ల‌కు ముందు.. చంద్ర‌బాబు ఇచ్చిన హామీ.. ఉచిత ఆర్టీసీ ప‌థ‌కం. దీనిని అమ‌లు చేసేబాధ్య‌త స‌ర్కారుదే అయినా.. లోపాల‌ను లాభాల‌ను కూడా.. నిర్ణ‌యించాల్సింది.. ప‌రిష్క‌రించాల్సింది.. మండ‌ప‌ల్లి.


రాష్ట్రంలో సుమారు రోజుకు కోటి మంది మ‌హిళ‌లు..రాక‌పోక‌లు సాగిస్తున్నారు. వీరంతా ఆర్టీసీ బ‌స్సులోనే ప్ర‌యాణం చేస్తున్నారు. రోజుకు గ‌రిష్ఠంగా రెండు సార్లు వారు ప్ర‌యాణించినా.. అది ఆర్టీసీపై బారం ప‌డేలా చేస్తుంది. రాష్ట్ర స‌ర్కారు.. ఇచ్చిన హామీ మేర‌కు ఆర్టీసీని ఉచితంగా అమ‌లు చేస్తే.. మ‌హిళ‌లు పెద్ద ఎత్తున ప్ర‌యాణిస్తారు. దీంతో ప్ర‌స్తుతం కోటిగా ఉన్న ఈ మ‌హిళా ప్ర‌యాణికుల సంఖ్య మ‌రింత పెర‌గ‌నుంది. దీనిని ముందుగానే అంచ‌నా వేసుకుని.. ఇబ్బందులు లేనివ్య‌వ‌స్థ‌ను తీసుకురావాల్సి ఉంది.


అలానే.. మ‌హిళల ఉచిత బ‌స్సు ప్రయాణంకార‌ణంగా.. ర‌వాణా రంగంపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతోంది. ఆటోలు, ట్యాక్సీలు..న‌డుపుతూ.. జీవ‌నం సాగించేవారు..ఉపాధి కోల్పోతారా?  లేక‌.. ఆదాయం త‌గ్గిపోతుం దా?  అనే విష‌యాల‌పై అధ్య‌య‌నం చేయాల్సి ఉంది. అలానే న‌ష్ట‌పోయేవారికి స‌హ‌కారం అందించాలి. ఇక‌, ర‌వాణా శాఖ‌లో కీల‌క‌మైన ఆర్టీఏ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌క్షాళ‌న చేయాల్సి ఉంది. అవినీతి ర‌హితం చేయాల‌ని ఎన్ని ప్ర‌య‌త్నాలు జ‌రిగినా.. ఆర్టీయే ప్రక్షాళ‌న కావ‌డం లేదు. దీంతో అనేక ర‌హ‌దారి ప్ర‌మాదాలు కూడా జ‌రుగుతున్నాయి.


ఇక దేశంలో అత్య‌ధిక రోడ్డు ప్ర‌మాదాలు జ‌రుగుతున్న రాష్ట్రాల్లో ఏపీ నెంబ‌ర్ 2గా ఉంది. మ‌హారాష్ట్ర నెంబ ర్ 1గా ఉంది. తెలంగాణ మూడో స్థానంలో ఉంది. ఈ ప‌రిస్థితిలో రాష్ట్రంలో సేఫ్ డ్రైవింగ్‌.. రోడ్ సేఫ్టీల‌ను ప‌క్కాగా అమ‌లు చేసేందుకు మంత్రి మండ‌వ‌ల్లి ప్ర‌య‌త్నించాలి. ర‌హ‌దారి ప్ర‌మాదాలను నివారించ‌డం ద్వారా.. కుటుంబాలు రోడ్డున ప‌డకుండా.. కాపాడే బాధ్య‌త కూడా.. మంత్రి మండ‌వ‌ల్లిపైనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: