రాజకీయాలలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉండి సుదీర్ఘ జాతీయస్థాయిలో రాజకీయ అనుభవం ఉందనేతగా పేరుపొందారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు.. అయితే ఇప్పుడు తాజాగా తన నీడను కూడా చంద్రబాబు నమ్మరు అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు గమనిస్తే చంద్రబాబు తనకంటే పవన్ కళ్యాణ్ ని ఎక్కువగా నమ్ముతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు చాలా ప్రాధాన్యత కల్పిస్తూ ప్రభుత్వ కార్యాలయాలన్నిటిలో కూడా తన ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ఉండేలా చూస్తున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.అలాగే పవన్ సైతం చంద్రబాబు అంటే మొదటి నుంచి చాలా గౌరవంతో కూడిన వ్యక్తిగా కనిపించారు. ఎన్నికల ఫలితాలు వెలుబడుతూ కూటమి ఘనవిజయం కాగానే చంద్రబాబు స్వయంగా జనసేన కార్యాలయానికి వెళ్లి పవన్ కళ్యాణ్ ని సైతం అభినందించారు. ఈ ఇద్దరు నేతలు తమకు అవకాశం వచ్చినప్పుడల్లా తన అనుబంధాన్ని సైతం చాటుకుంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు అయినప్పుడు పవన్ ఇచ్చిన మద్దతు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మార్చాయని చెప్పవచ్చు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద తన పొత్తు ప్రకటన ప్రకటించడం జరిగింది.


2024 ఎన్నికలలో కూటమి గెలిచిన తర్వాత మొదటి సమావేశంలో పవన్ చంద్రబాబు పైన చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి.. ఆయన నలిగిపోయారు అంటూ పవన్ కళ్యాణ్ అన్నమాట టిడిపి నేతలను సైతం బాగా ఆకట్టుకున్నాయి. చంద్రబాబు కూడా పవన్ వల్లే బీజేపీతో పొత్తు కూటమి అసాధారణ విజయాన్ని అందుకుంది అంటూ తెలియజేశారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు లాగా పవన్ పైన కూడా ఎంతో ఆదరణ చూపుతారు అంటూ తెలిపారు. ప్రమాణ స్వీకారం తర్వాత మొదటిసారి అమరావతికి వచ్చిన జనసేన రాజధాని రైతులు సైతం పూల వర్షంతో స్వాగతం పలికారు దీంతో టిడిపి నేతలు కూడా పవన్ ని నాయకుడుగా అంగీకరించారు. మొత్తానికి టిడిపి జనసేన మధ్య ఉన్న స్నేహబంధం ఈసారి ఎన్నికలు గట్టి ఎక్కించాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: