ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా లక్ష మంది వాలంటీర్లు వేర్వేరు కారణాల వల్ల వాళ్ల ఉద్యోగాలకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వాళ్లను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు. అయితే వాలంటీర్ల విషయంలో జగన్ స్పందించక తప్పదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వాలంటీర్లకు న్యాయం చేయాల్సిన బాధ్యత జగన్ పై ఉందని ప్రచారం జరుగుతోంది.
 
గ్రామ, వార్డ్ వాలంటీర్లలో రాజీనామా చేసిన వాళ్లలో చాలామంది వైసీపీ ఒత్తిడి చేయడం వల్ల రాజీనామా చేశామని చెబుతున్నారు. అకస్మాత్తుగా ఉద్యోగాలను కోల్పోవడం వల్ల తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని కొంతమంది వాలంటీర్లు చెబుతున్నారు. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ రావడానికి జగన్ కారణమనే సంగతి తెలిసిందే. వాలంటీర్ల విషయంలో జగన్ సైలెన్స్ వాలంటీర్లను బాధ పెడుతోంది.
 
జగన్ కనీసం వాలంటీర్లకు సపోర్ట్ గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్  చేసినా బాగుండేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ సైలెన్స్ వల్ల ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ కుప్పకూలే పరిస్థితులు సైతం ఏర్పడుతున్నాయని ఈ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చే ఛాన్స్ కూడా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
ఏపీలోని వాలంటీర్లలో చాలామందికి జగన్ అంటే అభిమానం ఉంది. ఆ అభిమానాన్ని మరింత పెంచుకునే విధంగా జగన్ వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పవచ్చు. మరోవైపు రాజీనామా చేసిన వాలంటీర్ల విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని టీడీపీ మంత్రులు చెబుతున్నారు. ఏపీలో రాజీనామా చేసిన వాలంటీర్ల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
 
మరోవైపు కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు 10000 రూపాయల వేతనాన్ని వెంటనే అమలు చేస్తే బాగుంటుందని చెప్పవచ్చు. గత ఐదేళ్లలో ఖర్చులు ఊహించని స్థాయిలో పెరిగిన నేపథ్యంలో వేతనాలు పెంచడం ద్వారా వాలంటీర్లు బెనిఫిట్ పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: