2019 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ పైన ఎన్నో విమర్శలు సైతం ఎక్కువగా వినిపించాయి. పవన్ కళ్యాణ్ కి ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని అందుకే పొత్తుల తోనే వస్తూ ఉంటారని విమర్శలు కూడా వినిపించాయి. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ టిడిపి ,జనసేన, బిజెపి పార్టీతో పొత్తు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లోని అధికారాన్ని రాబట్టడానికి కీలకమైన వ్యక్తిగా మారారు. పవన్ కళ్యాణ్ మీద గెలవకముందు చాలా దారుణమైన ట్రోల్స్ కూడా వినిపించాయి. మరో కొద్ది రోజులలో జనసేన పార్టీని మూసేసుకోవాలని ఉచిత సలహాలు కూడా ఇవ్వడం జరిగింది.కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన మీద తనకు నమ్మకం ఉందని ముందుకు సాగారు. 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ చాలా ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. 2014లో గెలిచే అవకాశాలు లేకపోవడంతో టిడిపి ,బిజెపి, పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే 2019 ఎన్నికలు వచ్చేసరికి పూర్తిగా మారిపోయింది టిడిపి , బిజెపి పార్టీలకు దూరమై జనసేన కొత్త మిత్రులతో జతకట్టి చాలా ఘోరమైన పరాజయాన్ని చూశారు. పవన్ కళ్యాణ్ ను చూడడానికి జనాలు వస్తారు కానీ ఓట్లు వేయరు అంటూ అన్న చిరంజీవి బాటలోని జనసేన పార్టీని మూసే చేయాలని చాలామంది నేతలు విమర్శించారు.


దీంతో 2024 ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం వైన తీవ్రమైన విమర్శలు పెంచుతూ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చకుండా పలు రకాల వ్యూహాలతో టిడిపి బిజెపి పార్టీ కూటమిలోకి తీసుకువచ్చారు. పొత్తు వ్యతిరేకిస్తున్న వారికి తక్కువ సీట్లను ఇస్తే ఒప్పుకున్నారని చాలా ఆరోపణలు కూడా చేశారు. జనసేన పార్టీకి సంస్థాగత బలం లేదని చాలా విమర్శలు వినిపించినప్పటికీ గెలవడం ముఖ్యమని భావించిన పవన్ కళ్యాణ్ తను అనుకున్నట్టుగానే గెలిచి చూపించారు .దీంతో కూటమి భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా వైసిపి పార్టీకి 11 స్థానాలకే పరిమితం చేశారు. దీన్నిబట్టి చూస్తే పవన్ కళ్యాణ్ అనుకుంటే ఏదైనా చేయగలరని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: