ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అటు తెలంగాణ రాష్ట్రంలో రెండు కీలక పార్టీలు ఓటమిపాలయ్యాయి. తెలంగాణలో 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్.. ప్రస్తుతం ప్రతిపక్షంలో కూర్చున్నారు. 10 సంవత్సరాల పాటు తెలంగాణను అద్భుతంగా డెవలప్మెంట్ చేసిన కేసీఆర్ ను కాదని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. ఇటు ఏపీలో కూడా ఐదు సంవత్సరాల జగన్ పాలనను వద్దనుకొని... తెలుగుదేశం కూటమికి అధికారాన్ని ఇచ్చారు ఏపీ ప్రజలు.
 

ఒకే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు కావడం...  అలాగే స్నేహితులుగా ఉన్న కెసిఆర్ మరియు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఓడిపోవడం జరిగింది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గురువు శిష్యులుగా పేరు ఉన్న సంగతి తెలిసిందే.  ఏపీలో చంద్రబాబు సీఎం కాగా తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే.. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులకు కేసీఆర్, జగన్ అంటే అస్సలు పడదు.

 

దింతో గులాబీ పార్టీని ఖాళీ చేయాలని రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. ఇటు ఏపీలో జగన్మోహన్ రెడ్డి పార్టీని కూడా ఖతం చేయాలని అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. దీనికి తగ్గట్టుగానే ఓడిపోయిన గులాబీ పార్టీ, వైసిపి పార్టీలను కీలక నేతలందరూ విడిపోతున్నారు. దీంతో కెసిఆర్, జగన్ చెందుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్ల కాలువలు అన్ని  సముద్రంలో కలవడం ఖాయమని ఆమె తాజాగా వెల్లడించారు. వైసీపీ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో త్వరలోనే విలీనం కాబోతున్నట్లు ఆమె చెప్పకనే చెప్పారు. ఇక ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా... గులాబీ పార్టీ... కాంగ్రెస్ లో విలీనం అవుతుందని... బిజెపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. సెక్యులర్ పార్టీ టిఆర్ఎస్... కచ్చితంగా కాంగ్రెస్లో విలీనం అవుతుందని చెబుతున్నారు. తెలంగాణలో త్వరలోనే బిజెపి అధికారంలోకి రాబోతుందని కూడా వివరిస్తున్నారు. అయితే ఇన్ని విమర్శల మధ్య... టిఆర్ఎస్ అలాగే వైసిపి పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత... కెసిఆర్, జగన్ లపై ఖచ్చితంగా ఉందని రాజకీయ విశ్లేషకులు సూచనలు చేస్తున్నారు. క్యాడర్లో మనోధైర్యం నింపి పార్టీని ముందుకు తీసుకోవాలని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: