* ఏపీకి జీవనాడి పోలవరం
* పోలవరం ఎత్తే పెద్ద సమస్య
* భద్రాచలంలోని కొన్ని గ్రామాలు ముంపునకు గురి కావడం  
* ఏడు మండలాల  వివాదం
* గోదావరి జలాల పంపకాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు అయ్యాయి. అందులోనూ గతంలో... గురువు, శిష్యులుగా ఉన్న చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు  ముఖ్యమంత్రిగారంగంలోకి వచ్చారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగా... ఏపీలో చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. అయితే గురువు శిష్యులు...  ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే ఏపీ అలాగే తెలంగాణకు మంచి రాబోతున్నట్లు.. కొంతమంది చర్చించుకుంటున్నారు.

ముఖ్యంగా... ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కలయిక కారణంగా...  పోలవరం ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అవుతుందని కొంతమంది చెబుతున్నారు. ఎప్పుడైనా రెండు తెలుగు రాష్ట్రాలు... కలిసిమెలిసి ముందుకు వెళ్లాలి.  ఇక చంద్రబాబు,రేవంత్ రెడ్డి మధ్య మంచి బంధం ఉన్న నేపథ్యంలో...పోలవరం ప్రాజెక్టు పనులు త్వరితగతిన జరుగుతాయని చెబుతున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. వాస్తవానికి... పోలవరం కారణంగా భద్రాచలం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు మునిగిపోతున్నాయి.

 గోదావరి వరద ఉధృతంగా రావడంతో.. మొన్న భద్రాచలం పూర్తిగా మునిగిపోయింది. ఈ తరుణంలో ఏపీ అలాగే తెలంగాణ ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొంది. పోలవరం ఎత్తు పెంచడం కారణంగా... వరద మొత్తం భద్రాచలంలో ఆగిపోతుందని తెలంగాణ వాదన. పోలవరం ఎత్తు పెంచుకోమని కేంద్ర ప్రభుత్వమే పర్మిషన్లు ఇచ్చిందని.. ఇటు ఏపీ ప్రభుత్వం అప్పట్లోనే స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ పూర్తిగా నష్టపోయింది.  వరదల కారణంగా భద్రాచలంతో పాటు ఆ జిల్లాలోని చాలా ప్రాంతాలు మునిగిపోయాయి.

 ఆ ప్రాంతాలను అప్పటి కెసిఆర్ ప్రభుత్వం ఆదుకుంది. అయితే ఇప్పుడు చంద్రబాబు.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో... పోలవరం ఎత్తు విషయం జోలికి వెళ్లకుండా... వరద ఉధృతి పెరగగానే... పోలవరం గేట్లు ఎత్తాల్సి ఉంటుంది. అలా చేస్తే భద్రాచలంలో ఉన్న  కొన్ని ప్రాంతాలు అస్సలు మునిగిపోవు. వరద ఉధృతి తగ్గిపోయి.. ఏపీ, తెలంగాణ మధ్య గొడవలు సమస్య పోతాయి. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో... కట్టుకునేందుకు ఎలాంటి అడ్డంకులు ఉండవు.

 కెసిఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు... ఏపీలో కలిపిన ఏడు మండలాల కోసం.. పోరాటం చేసింది. అయితే చంద్రబాబు,  రేవంత్ రెడ్డి కూడా ఈ ఏడు మండలాల కోసం ఆలోచన చేయాలి. ఏపీలో ఉన్న ఈ ఏడు మండలాల కోసం..  చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టేలా...  రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పాలి. ఆ దిశగా చంద్రబాబు కూడా అడుగులు వేయాలి. ఇక గోదావరి జలాలను... రెండు రాష్ట్రాలు సమానంగా పంచుకోవాలి. గోదావరి నుంచి వచ్చే వరదను.. కాలేశ్వరం దగ్గర తెలంగాణ వాడుకోవాలి. ఇటు పోలవరం దగ్గర ఏపీ వాడుకోవాలి.

పోలవరం ఎత్తు,  తెలంగాణలో మునిగే ప్రాంతాలు, ఇటు ఏడు మండలాల వివాదం,  ఈ అంశాలపై రేవంత్ రెడ్డి, చంద్రబాబు కూర్చుండి మాట్లాడుకొని... రెండు రాష్ట్రాలకు న్యాయం జరిగేలా ముందుకు వెళ్లాలి. కెసిఆర్, జగన్ ఇద్దరు వ్యవహరించినట్లుగా... కాకుండా... సామరస్యంగా పరిష్కారాలు చేసుకోవాలి. అప్పుడే ఏపీ జీవనాడి అయిన పోలవరం కు లైన్ క్లియర్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: