దేశవ్యాప్తంగా 7 విడతల ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో కేంద్రంలో అయితే బిజెపి అధికారంలోకి వచ్చింది. ఇక రాష్ట్రంలో చాలావరకు కాంగ్రెస్ ఇతర ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అలాంటిది రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం  కాంగ్రెస్, టిడిపి అధికారంలోకి వచ్చింది. అంతేకాకుండా ఒకప్పటి గురు శిష్యులు ఇద్దరు సీఎంలుగా మారారు. అలాంటి ఈ తరుణంలో  దాదాపు నాలుగు నెలల గ్యాప్ లో ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగి సీఎంలుగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ముందుగా సీఎం బాధ్యతలు చేపడితే,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు సీఎం బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు నుంచి సీఎం రేవంత్ రెడ్డికి కాస్త చిక్కులు వచ్చి పడుతున్నాయట..అదేంటి అనే వివరాలు చూద్దాం..

గత 2019 ఎన్నికల సమయంలో ఏపీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే తెలంగాణలో కేసీఆర్ సీఎంగా ఉన్నారు. వీరిద్దరి మధ్య విపరీతమైనటువంటి పోటీ ఏర్పడింది. ఇక తెలంగాణ సీఎం ఎన్నో పథకాలు తీసుకువచ్చి జగన్మోహన్ రెడ్డిని అక్కడి ప్రజలు ప్రశ్నించేలా చేశారు. దీంతో ఆయన కూడా కొత్త కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు. అయినా ప్రజలు నమ్మలేదు ఈ ఇద్దరిని  ఇంటికి పంపించేశారు. తెలంగాణలో కాంగ్రెస్ కు పట్టం కడితే ఏపీలో టీడీపీకి పట్టం కట్టారు.  ఇదే తరుణంలో ఈ రెండు రాష్ట్రంలో సీఎంగా బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు మొదటి సంతకం మెగా డీఎస్సీపై పెట్టారు. ఆ తర్వాత సంతకం ఉచిత బస్సు పోలవరం ప్రాజెక్టు ఇలా సమస్యలు ఉన్న వాటిపై పెడుతున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కేవలం ఉచిత బస్సు, ఉచిత కరెంటు, గ్యాస్ అమలు చేశారు.

 కానీ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాటను మాత్రం ఇప్పటివరకు నిలబెట్టుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో ఎంతోమంది నిరుద్యోగులు మెగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. నిరుద్యోగులు, ఉద్యోగుల వల్లే  కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని అందరికీ తెలుసు. ఉద్యోగులకు, నిరుద్యోగులకు  భద్రత కల్పించే విషయంలో రేవంత్ రెడ్డి వెనుకబడ్డారని,  ఈయన కంటే చంద్రబాబు నాయుడు బెటరని ఆయన ఉద్యోగులు, నిరుద్యోగుల పాలిట వరంగా మారారని అంటున్నారు. ఈ  తరుణంలో ప్రతిపక్షాలు కూడా ఆసరాగా  తీసుకొని, రాజకీయ గురువు చంద్రబాబును చూసి నేర్చుకో పరిపాలన చేయడం అంటే అది అంటూ ఓవైపు హరీష్ రావు మరోవైపు  బిజెపి నాయకులంతా విమర్శిస్తూ వస్తున్నారు.  ఈ విధంగా చంద్రబాబు మొదలుపెట్టే ప్రతి పని రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: