( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ . )

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. ఎన్టీఆర్ హ‌యాంనుంచి టీడీపీని అంటిపెట్టుకుని ఉన్న గోరంట్ల బుచ్చ య్య చౌద‌రి ప‌రిస్థితి.. ఆశ‌-నిరాశ‌ల మ‌ధ్య కొట్టుమిట్టాడుతోంది. తాజా ఎన్నిక‌ల్లో ఏడోసారి విజ‌యం ద‌క్కించుకున్న కురువృద్ధుడు బుచ్చ‌య్య‌. దీంతోస‌హ‌జంగానే ఎప్పుడో ఎన్టీఆర్ హ‌యాంలో ఒక్క‌సారి ద‌క్కిన మంత్రి ప‌ద‌విని ఇప్పుడైనా ద‌క్కించుకుందామ‌ని ఆశించారు.త‌న మ‌న‌సులోని మాట‌ను ఎన్నిక‌ల‌కు ముందు .. ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత కూడా వెల్ల‌డించారు.


కానీ.. ప్ర‌భుత్వంలో బుచ్చ‌య్య‌కు ఛాన్స్ చిక్క‌లేదు. ఉన్న 26 మందిమంత్రి ప‌ద‌వుల్లో ఒక‌టి సీఎంకు పోగా.. ఒక‌టి ఖాళీగా పెట్టారు. మిగిలిన వాటిలో నాలుగు కూట‌మి పార్టీల‌కు  కేటాయించారు.దీనికితోడు యువ‌ర‌క్తానికి ప్రాదాన్యం పెంచారు. దీంతో బుచ్చయ్య‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేదు. పోనీ.. స్పీక‌ర్ అయినా ద‌క్కుతుంద‌ని ఆశించారు. అయితే.. ఈ ప‌ద‌వి  కూడా.. బుచ్చ‌య్య‌కు చిక్క‌లేదు. దీనిని బీసీ ల‌కు కేటాయించాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు.


దీంతో న‌ర్సీప‌ట్నం నుంచి ఆరో సారి ఎన్నికైన‌.. అయ్య‌న్న పాత్రుడికి స్పీక‌ర్‌ప‌ద‌వి ద‌క్కింది. డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి అయినా..ద‌కక్క‌క‌పోతుందా? అని బుచ్చ‌య్య మ‌న‌సును సాగదీసుకుని మ‌రీ ఆశ‌లు పెట్టుకున్నారు. దీనిని కూట‌మిపార్టీ జ‌న‌సేన కొట్టుకుపోయింది. ఇక‌, మిగిలింది ఏంటి? అంటే ప్రొటెం స్పీక‌ర్ ప‌ద‌వి మాత్రం. ఇది ఒక్క‌రోజు సంబ‌ర‌మే. అయిన‌ప్ప‌టికీ.. కీల‌క‌మైన బాధ్య‌తే. దీనినే చంద్ర‌బాబు చివ‌ర‌కు బుచ్చ‌య్యకు కేటాయించారు.


విధిలేని ప‌రిస్థితి.. కాదంటే.. ఇది కూడా ద‌క్క‌ద‌న్న ఆవేద‌న‌.. ఎలా చూసుకున్నా.. ఈ చిన్న ఆశ త‌లుపు త‌ట్ట‌డంతో బుచ్చ‌య్య ఒప్పేసుకున్నారు. గురువారం ఆయ‌న ప్రొటెం స్పీక‌ర్‌గా ప్ర‌మాణం చేయ‌నున్నారు. ఆయ‌న‌తో గ‌వ‌ర్న‌ర్ న‌జీర్ ప్ర‌మాణం చేయించ‌నున్నారు. అనంత‌రం మంత్రి వ‌ర్గ స‌భ్యులు పోను.. 149 మందితో ప్రొటెం స్పీక‌ర్ హోదాలో బుచ్చ‌య్య చౌద‌రి ప్ర‌మాణ స్వీకారం చేయించ‌నున్నారు. ఇదేస‌మ‌యంలో ఒక‌రితో స్పీక‌ర్‌గా కూడా ప్ర‌మాణం చేయిస్తారు. చివ‌ర‌కు ఇదీ.. బుచ్చ‌య్యకు మిగిలిన `సం`తృప్తి!

మరింత సమాచారం తెలుసుకోండి: