- జ‌గ‌న్‌, కేసీఆర్ కామ‌న్ శ‌త్రువుల కోసం కొత్త రాజ‌కీయం
- ఐదేళ్లు ఈ పోరాటం మాత్రం కామ‌న్‌

( హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ )

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు, తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇద్దరూ పాత స్నేహితులు.. ఇంకా చెప్పాలంటే గురుశిష్యులు. చంద్రబాబు కిందే రేవంత్ రాజకీయంగా ఓనమాలు నేర్చుకుని.. ఆ తర్వాత తిరుగులేని శక్తిగా ఎదిగి.. ఈరోజు తెలంగాణకు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఇద్దరు ఒకప్పటి గురు, శిష్యులు. ఒకే పార్టీలో కలిసి పనిచేసిన వారు కావడంతో.. ఈ ఐదేళ్లలో వీరి రాజకీయం ఎలా ఉండబోతుంది..? అన్నది సహజంగానే తెలుగు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో.. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వామిగా ఉంది. కేంద్రం విషయంలో చంద్రబాబుకు కొంత సానుకూలత ఉంటుంది. అదే రేవంత్ కేంద్రంతో ఎలా మెలుగుతారు..? ఎలాంటి పోరాటాలు చేసి తన రాష్ట్రానికి నిధులు రప్పించుకుంటారు..? అన్నది చూడాలి.


పరిపాలనాపరంగా, పోరాటాలు, సిద్ధాంతాల పరంగా ఎవరి దారి వారు చూసుకున్నా.. ఈ ఐదేళ్లు ఒక విషయంలో మాత్రం రేవంత్, చంద్రబాబు కామన్ రాజకీయం చేయక తప్పని పరిస్థితి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ఇటు చంద్రబాబుకు, అటు రేవంత్ కు ఇద్దరికీ పడదు. కేసీఆర్‌ను ఎదుర్కొనే విషయంలో ఈ గురు శిష్యులు ఇద్దరు కామన్ రాజకీయం చేయాల్సి ఉంటుంది. అయితే అది ఎలా.. చేస్తారు అన్నది చూడాలి. 2019 ఎన్నికలలోనే చంద్రబాబుకు వ్యతిరేకంగా.. జగన్ కు సపోర్ట్ చేసిన కేటీఆర్, కెసిఆర్ ఇద్దరు ఈ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా జగనే గెలుస్తారన్న సమాచారం ఉందని.. ఎన్నికలకు ముందు ఓపెన్ గానే చెప్పారు. అంటే చంద్రబాబుపై తమ వ్యతిరేకతను మరోసారి బయట పెట్టుకున్నారు.


ఈ టైంలో చంద్రబాబు కూడా కేసీఆర్, బిఆర్‌ఎస్ పట్ల ఏమాత్రం సానుకూల దృక్పథంతో ఉండరు అని చెప్పాలి. ఇక చంద్రబాబు చేతిలో చిత్తుగా ఓడిపోయిన జగన్‌కు సైతం చంద్రబాబు మాత్రమే కాదు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నా శత్రువుగానే చూస్తూ ఉంటారు. కేసీఆర్‌తో చిన్నచిన్న విభేదాలు ఉన్న వీరిద్దరి స్నేహం ఒక రేంజ్‌లో ఉంటుంది. పైగా 2019 ఎన్నికలలో కేసీఆర్.. జగన్ కు సపోర్ట్ చేశారు. 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ జగన్, వైసీపీ అభిమానులు అందరూ.. కెసిఆర్ కు సపోర్ట్ చేశారు. అంత ఎందుకు ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలోను కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు జగన్ గెలుస్తారని చెప్పడంతోనే వీరిద్దరి మధ్య స్నేహం ఎలా కంటిన్యూ అవుతుందో తెలుస్తోంది.


ఇక జగన్‌కు.. చంద్రబాబు శిష్యుడు కావడంతో రేవంత్ రెడ్డి అంటే అస్సలు పడదు. ముఖ్యమంత్రి అయితే పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనీసం ఫోన్ చేసి శుభాకాంక్షలు కూడా చెప్పలేదని రేవంత్ చెప్పకనే చెప్పిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా పరిపాలన పరంగా ఎలా ఉన్నా చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా రాజకీయంగా కామన్ శత్రువులుగా కేసీఆర్, జగన్ ను చూస్తూ ఈ ఐదేళ్లు రాజకీయం చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: