•మంచి అనుబంధంతో ముందుకు సాగుతున్న బాబు, రేవంత్
•ఈ గురు శిష్యుల అనుబంధంతో తెలుగు రాష్ట్రాల సమస్యలు తీరతాయాని ఆశతో ఉన్న తెలుగు ప్రజలు


( ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014 వ సంవత్సరంలో రెండు భాగాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ నుంచి తెలంగాణ వేరైపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. అయితే విడిపోయిన తర్వాత ఆంధ్ర, తెలంగాణ మధ్య సత్సంబంధాలు ఏ విధంగా ఉంటాయో అని ప్రజలు  భావించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగా, తెలంగాణ రాష్ట్రానికి చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి అయ్యారు.అయితే వీళ్లిద్దరి మధ్య కూడా మొదటి నుండి  పెద్దగా మంచి సంబంధాలు లేవు. పైగా కెసిఆర్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టినందుకు ఆంధ్రా ప్రజలకు పీకల్లోతూ కోపం ఉండేది. అందువల్ల చంద్రబాబు నాయుడుకి కూడా కెసిఆర్ అంటే కోపం ఉండేది. అయితే ఆ తర్వాత 2019 వ సంవత్సరం ఎన్నికలకు ముందు కేసీఆర్  జగన్ కి మద్దతు ఇస్తూ వచ్చాడు. ఇక 2019 లో ఆంధ్ర ప్రదేశ్ కి జగన్ మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి అవ్వగా, తెలంగాణకి మరోసారి చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయ్యారు.అప్పుడు వీరిద్దరి మధ్య  మంచి స్నేహ బంధమే ఏర్పడింది. కానీ ఆ బంధం కొంతకాలానికే తగ్గిపోయింది. తెలంగాణాలో కెసిఆర్ పై జనాల్లో నెగటివిటీ ఏర్పడింది. 2023 వ సంవత్సరం తెలంగాణలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. దానితో కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు.


ఇక ఈ 2024 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు 4 వ సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు.అయితే రేవంత్, బాబుల మధ్య మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ నేతలలో రేవంత్ రెడ్డి ఒకరు.పైగా చంద్రబాబుని తన గురువులా భావిస్తాడు  రేవంత్ రెడ్డి. అలాంటి ఈ గురు శిష్యులు రెండు తెలుగు రాష్ట్రలకు ముఖ్య మంత్రులుగా ఉండటం వలన మంచి సంబంధాలు ఏర్పడి రాబోయే 5 సంవత్సరాలు రెండు రాష్ట్రాలని సస్యశ్యామలం చేస్తారని ప్రజలు భావిస్తున్నారు. ఇక ఇప్పుడు రేవంత్‌, బాబు ఇద్ద‌రు గురుశిష్యులు కాబట్టి  నీటి స‌మ‌స్య‌లు, పోల‌వ‌రం, ముంపు మండ‌లాల విష‌యంలో ఖచ్చితంగా బాగా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న ఆశతో తెలుగు ప్రజలు ఉన్నారు. వీరిద్దరి మధ్య ఉన్న మంచి సంబంధాల కారణంగా ఇరు రాష్టాల్లో ఉన్న సమస్యలకు ఖచ్చితంగా సహాయసహకారాలు అందించుకుంటారని తెలుగు ప్రజలు భావిస్తున్నారు. మరి ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లో నీటి సమస్యలు రాకుండా నదుల నీళ్లు సముద్రాల్లో కలిసి వృధా అవ్వకుండా రాష్ట్ర గ్రామాలకు చేరువయ్యేలా చేసి రెండు రాష్ట్రాలని సస్యశ్యామలంగా చేస్తారని తెలుగు ప్రజలు భావిస్తారు. మరి చూడాలి రేవంత్, బాబు సంబంధాలు మున్ముందు ఎలా ఉంటాయో అనేది..

మరింత సమాచారం తెలుసుకోండి: