[అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ఏపీ-తెలంగాణ రాష్ట్రాలు భౌతికంగా విడిపోయాయి. అనేక ఉద్య‌మాల నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్రం 2013-14 మ‌ధ్య ఏర్ప‌డింది. దీంతో ఎవ‌రి పాల‌న వారు చేసుకుంటున్నారు. రాష్ట్రంవిడిపోయి.. ప‌దేళ్లు పూర్త‌యింది. అక్క‌డ‌, ఇక్క‌డ కూడా.. మూడు సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. ప్ర‌భుత్వాలు కూడా త‌మ ప‌ని తాము చేస్తున్నాయి. అయితే.. ఈ రెండు రాష్ట్రాలు భౌతికంగా విడిపోయినా.. అనేక స‌మ‌స్య‌లు మాత్రం ప‌ట్టిపీడిస్తున్నాయి. దీంతో రెండు రాష్ట్రాలు కూడా ఇబ్బంది ప‌డుతున్నాయి.


1) జ‌లాల పంపిణీ:  కృష్ణా, గోదావ‌రి న‌దుల‌కు సంబంధించిన జ‌లాల పంపిణీ విష‌యం రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య తీవ్ర వివాదంగానే ఉంది. దీనిని ప‌రిష్క‌రించేందుకు ఏ ప్ర‌భుత్వం కూడా ముందుకు రాలేదు. వ‌చ్చినా.. ఎవ‌రి పంతం వారు నెగ్గించుకునేందుకు ప్ర‌య‌త్నించారు. ఇక‌, ఇప్పుడైనా.. ఈ స‌మ‌స్య తీరుతుందా? అంటే.. ప్ర‌స్తుతం కేంద్రం నియ‌మించిన క‌మిటీ దీనిని ప‌ర్య‌వేక్షిస్తోంది.పైగా కీల‌క ప్రాజెక్టుల‌ను కేంద్ర‌మే తీసుకుంటామ‌ని చెప్పింది. దీనికి తెలంగాణ ప్ర‌భుత్వం మోకాల‌డ్డింది.


2) అప్పులు:  రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య అప్పుల వ్య‌వ‌హారం కూడా రాజ‌కీయంగా దుమారం రేపుతోంది. గ‌తంలో 2014-15 మ‌ధ్య తెలంగాణ‌కు ఏపీ ప్ర‌భుత్వం విద్యుత్ ను స‌ర‌ఫ‌రా చేసింది. దీనికి సంబంధించి 5272 కోట్ల‌రూపాయ‌లు ఏపీకి తెలంగాణ చెల్లించాల్సి ఉంది. దీనిని గ‌త జ‌గ‌న్ ప్ర‌భుత్వం రాబ‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసినా.. మీరే మాకు బాకీ అంటూ.. తెలంగాణ స‌ర్కారు మొండికేసింది. ఇప్ప‌టికీ ఈ వివాదం తేల‌లేదు.


3) షెడ్యూల్ 9:  విభ‌జ‌న చ‌ట్టంలోని షెడ్యూల్ 9లో పేర్కొన్న ప్ర‌భుత్వ ఆస్తుల పంపిణీ.. సొంతంచేసుకునే విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం దూకుడు ప్ర‌ద‌ర్శించింది. విభ‌జ‌న చ‌ట్టానికి ప‌దేళ్లు నిండిన ద‌రిమిలా.. ఇక‌, హైద‌రాబాద్‌లో ఉన్న ఏపీ భ‌వ‌నాల‌ను తాము స్వాధీనం చేసుకుంటామ‌ని.. సీఎం రేవంత్ గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌క‌టించారు. అయితే, కాస్త ఆగాలంటూ.. అప్ప‌టి సీఎం జ‌గ‌న్ లేఖ రాశారు. త‌ర్వాత‌.. ఏమైందో తెలియ‌దు. దీనిపైనా చంద్ర‌బాబు దృష్టి పెట్టాలి.


4) ఆర్టీసీ ఆస్తులు:  ఇరు రాష్ట్రాల మ‌ధ్య‌ ఆర్టీసీ ఆస్తుల వివాదం ఇంకా తేల‌లేదు. ముఖ్యంగా ఆర్టీసీ భ‌వ‌న్‌కు సంబంధించి ఏపీ వాటా తేల‌లేదు. అదేవిధంగా లేక్ వ్యూ అతిథి గృహంలోనూ వాటాలు తేలాల్సి ఉంది. ఇవ‌న్నీ.. తేలాలంటే.. ప‌రిష్కారం కావాలంటే.. తెలంగాణ సీఎం రేవంత్‌- ఏపీ సీఎం చంద్ర‌బాబుల మ‌ధ్య ఉన్న రిలేష‌న్ అత్యంత కీల‌కంగా మార‌నుంది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: