రాజకీయాలలో మాటకు ప్రతి మాట అనేది కచ్చితంగా ఉండనే ఉంటుంది. కానీ సవాలు విసిరిన మాటలు నిలబెట్టుకోవడం మాత్రం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అయితే కొంతమంది ఎన్నికల వేడిలో సవాళ్లు విసురుకున్నప్పటికీ ఆ తర్వాత పలు కారణాలు చెప్పి తప్పించుకోవడం జరుగుతుంది. కానీ మాజీమంత్రి సీనియర్ నాయకుడు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం మాత్రం అందుకు మినహాయింపుగా ఉన్నారు. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఎక్కువగా విరుచుకుపడడం జరిగింది.


పవన్ కళ్యాణ్ ను పిఠాపురంలో ఓడిస్తామంటూ ఛాలెంజ్ చేశారు. ఒకవేళ అలా జరగకపోతే తన పేరున ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానని శబదం కూడా చేశారు. అయితే ఎన్నికలలో పవన్ పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. సవాల్ ఓడిపోవడంతో మాటకు కట్టుబడి తన పేరును సైతం మార్చుకోవడం జరిగింది ముద్రగడ పద్మనాభం.. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి ఐదవ తేదీన ముద్రగడ మీడియా ముందుకు వచ్చి తన సవాల్ చేసి ఓడిపోయానని చెప్పినట్టుగానే తన పేరుని సైతం మార్చుకుంటున్నాను అంటు ముద్రగడ పద్మనాభం వెల్లడించారు.


అలాగే చెప్పిన మాట ప్రకారం తన పేరు పద్మనాభ రెడ్డి గా మార్చానని గెజిట్ పబ్లిక్ కోసం అంతా సిద్ధం చేసుకుని డాక్యుమెంట్లు పంపిస్తున్నానట్టు వెల్లడించారు. ఇప్పుడు అది అధికారికంగా ఓకే అయ్యింది అంటూ కూడా గెజిటెడ్ వచ్చేసింది ఇకపైన తన పేరు అధికారికంగా ముద్రగడ పద్మనాభరెడ్డి అన్నట్లుగా తెలియజేశారు.. చాలామంది తనని ఉప్మా పద్మనాభం అని పిలుస్తూ ఉన్నారు. పదేపదే ఈ విషయం పైన ట్రోల్ చేయడం పై చాలా సీరియస్ అయ్యారు.. ఇంటికి వచ్చినవారికి టిఫిన్ కాఫీ వంటి ఇవ్వడం తప్పు కాదని ఆ విధానం తన తల్లితండ్రులు తాత నుంచే వస్తోంది అంటూ వెల్లడించారు. సో దీన్ని బట్టి చూస్తే ఇక మీద ముద్రగడ పద్మనాభం కాదు రెడ్డి అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: