ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రోజా  మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. నగరి నియోజకవర్గంలో... కొంతమంది వైసీపీ నేతల కారణంగానే రోజా ఓడిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే  ఎమ్మెల్యే ఓడిపోయినా అనంతరం... రోజా ఎక్కడ కనిపించడం లేదు. మీడియా ముందుకు రావడానికి కూడా జంకుతున్నారు రోజా. అయితే టిడిపి అధికారంలోకి రాగానే ఋషికొండ  భవనాల గురించి జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది.


అయితే దీనిపై... ఏపీ మాజీ మంత్రి రోజా సోషల్ మీడియాలో స్పందించారు. తన ఓటమికి కారణాలు చెప్పకుండా... జగన్కు సపోర్ట్ గా... ఋషికొండ భవనాలపై కౌంటర్ ఇచ్చారు. విశాఖపట్నంను ఒక బ్రాండ్ నగరంగా చూపించేందుకు  జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారని... కానీ దీనిని టిడిపి పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు రోజా. చంద్రబాబు నాయుడు అమరావతి కడతానని ఏపీ ప్రజలను మోసం చేశాడని... కానీ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం బ్రాండ్ పెంచాడని తెలిపారు.


అయితే రుషికొండ భవనాలపై రోజ స్పందించడం పట్ల... నగరి టిడిపి ఎమ్మెల్యే భాను ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు.  ముందుగా బెంజ్ కారు కొనుగోలు చేసిన రోజా... అంత డబ్బు ఎక్కడిది అని  ఫైర్ అవుతున్నారు. ఋషికొండ భవనాలకు... రోజా కొనుగోలు చేసిన కారుకు మధ్య సంబంధాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు నగరి టిడిపి ఎమ్మెల్యే భాను ప్రసాద్.

 పర్యాటకశాఖ మంత్రిగా ఉన్నప్పుడు... విశాఖలో చాలామంది కాంట్రాక్టర్ల దగ్గర నుంచి... రోజా డబ్బులు తీసుకుందని ఆయన  ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు రుషికొండ భవనాలు కట్టిన కాంట్రాక్టర్... కూడా రోజాకు డబ్బులు.. తీవ్రస్థాయిలో  కౌంటర్ ఇచ్చారు. అందుకే రోజా... బెంజ్ కారు కొనుగోలు చేసిందని.. ఋషికొండ భవనాలపై  ఇప్పుడు స్పందిస్తుందని  భాను ప్రసాద్ చురకలు అంటించారు.  దీంతో అనవసరంగా రోజా స్పందించిందని... వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారట. మరి టీడీపీ ప్రచారంపై రోజా ఎలా రీవర్స్‌ ఎటాక్‌ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: