ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  రాజకీయాలు ఈ మూడు నెలల్లో చాలా స్పీడ్ గా మారిపోయాయి. ఈ రాజకీయాలను చూస్తే మాత్రం ఒక సామెత తప్పక గుర్తుకు వస్తుంది. బండ్లు ఓడలవుతాయి ఓడలు బండ్లు అవుతాయి. ఈ సామెత ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయని చెప్పవచ్చు. ఎవరు ఊహించని విధంగా జగన్మోహన్ రెడ్డి విపరీతమైన ఓటని పాలయ్యారు. ఎవరు ఊహించని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.  అసలు ఈ రిజల్ట్ ను వారి పార్టీ నాయకులే కాకుండా ప్రజలు కూడా ఊహించలేదట. కానీ రిజల్ట్ మాత్రం అద్భుతంగా టిడిపికి పేవర్ గా వచ్చింది. పూర్తిస్థాయి మెజారిటీతో  కూటమి ప్రభుత్వం కొలువుదిరింది. చంద్రబాబు నాలుగో సారీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేసారు.

 అంతేకాకుండా తన కింద మొత్తం 24 మంది మంత్రులతో మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకొని పాలన మొదలుపెట్టారు. ఇక ఎప్పుడైతే టిడిపి అధికారంలోకి వచ్చిందో, అప్పటినుంచి టిడిపి నాయకులు కొన్ని ప్రాంతాల్లో వైసిపి నాయకులపై దాడులు చేయడం బెదిరించడం వంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని ప్లేసులలో కొట్టారు. కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకే పరిమితం అయ్యాడు. ఓడిపోయినప్పటి నుంచి ఆయన ఓటమికి కారణాలు ఏంటి అనేది తన నాయకులతో సమీక్ష చేస్తున్నాడు.  ఇప్పటికి కూడా అంతటి ఓటమికి కారణమేంటనేది ఆయనకు అర్థం కావడం లేదట. ఏది ఏమైనా రాజకీయ వ్యవస్థలో గెలుపోటములు సహజం, ఎక్కడ పోగొట్టుకుంటామో మళ్లీ అక్కడి నుంచే వెతకడం మొదలుపెడితే అనుకున్నది సాధించగలం.

 ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. అలాగని ఇంట్లో సైలెంట్ గా కూర్చుంటే సరిపోదు. ప్రజా సమస్యలపై  గళం విప్పుతూ, వైసీపీ కార్యకర్తలకు ధైర్యం ఇస్తేనే పార్టీ బ్రతికి బట్ట కడుతుంది. దానికోసం జగన్ మోహన్ రెడ్డి  వైసిపి విస్తృతస్థాయి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టిడిపి గెలిచిన తర్వాత రాజకీయ దాడుల్లో గాయపడినటువంటి వైసీపీ కార్యకర్తలను, నాయకులను మరియు వైసిపి ఓటమి తట్టుకోలేక మృతి చెందిన వారిని పరామర్శించడానికి ఆయన వస్తున్నారట. ఓదార్పు యాత్ర పేరుతో ఏడాది డిసెంబర్ నుంచి మళ్లీ ప్రజల్లోకి వస్తారని తెలుస్తోంది.  దీనిపై అధికారిక ప్రకటన బయటకు రాలేదు కానీ, తప్పక ఆయన ఓదార్పు యాత్ర మొదలు పెడతారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: