ఏపీలో కొత్తగా మరో కోడిగుడ్డు మంత్రి తెరపైకి వచ్చాడు. గతంలో గుడివాడ అమర్నాథ్‌ కొడిగుడ్డు మంత్రిగా ఉండగా.. ఇప్పుడు టీడీపీలో కూడా మరో మంత్రి వచ్చేశాడు. అతనే ఏపీ రవాణా శాఖమంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఆర్టీసీని హాఫ్‌ బాయిల్డ్‌ ఎగ్‌ అంటూ వ్యాఖ్యానించాడు రవాణా శాఖమంత్రి రాంప్రసాద్ రెడ్డి. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండు లో సౌకర్యాలు పరిశీలించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. సమస్యలపై చర్చించి ఏపీఎస్ఆర్టీసీ ని అభివృద్ధి చేస్తామని... మెరుగైన బస్సులు సంస్ధకు అందించడానికి పని చేస్తామని ప్రకటించారు.

ప్రైవేటు, ప్రభుత్వ సంస్ధల సమన్వయంగా ఆర్టీసీని నడిపించేందుకు పని చేస్తామంటున్న మంత్రి.... మహిళలకు ఫ్రీ బస్సు సర్వీసు మా హామీ.. అమలు చేస్తామని ప్రకటన చేశారు. జీతాలు ఇచ్చేది ఏపీ ప్రభుత్వం.. సంస్ధను నడిపేది  కార్పొరేషన్ అన్నారు రాంప్రసాద్ రెడ్డి. కొత్త బస్సులు కొంటాం.. కచ్చితంగా బస్సులు ఉంటేనే సంస్ధ నడుస్తుందని హామీ ఇచ్చారు. మహిళలకు ఫ్రీ సర్వీసు అంటూ ఏదో ఒక బస్సులో సర్వీసు కాకుండా అన్ని మంచి బస్సులే ఇస్తామని... పాత బస్సులు ఉన్న మాట వాస్తవం.. దీనిపై పూర్తి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

గత ప్రభుత్వాలపై మేం నిందలేస్తూ కూర్చోబోమని... గత ప్రభుత్వం విలీనం సరిగా చేయలేదని వివరంచారు. టిడిపి కి అధికారం రావడానికి కారణం ఈ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని మహిళా మూర్తులు అని... మా ప్రభుత్వం లో కార్యక్రమాలు లేటుగా అయినా లేటెస్టుగా చేస్తామన్నారు. ఒక అధ్యయన కమిటీ వేసి, పక్కన రెండు రాష్ట్రాలలో స్వయంగా ప్రయాణించి అక్కడి లోటుపాట్లు తెలుసుకుని మహిళలకు ఫ్రీ బస్సు ఇస్తామని... చట్ట విరుద్ధంగా ఏదైనా ఫండ్ ఏర్పాటు చేసి ఉంటే కచ్చితంగా మేం రద్దు చేస్తాం.. చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

కార్మికుడు చనిపోతే అంత్యక్రియలు ఖర్చుకు ఇచ్చే సొమ్ము 25 వేలకు పెంచుతున్నాం... ప్రమాదాల నివారణకు చర్యలు మేం తీసుకుంటామని హామీ ఇచ్చారు  ఏపీ  రవాణా శాఖమంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఎలక్ట్రిక్ బస్సులు మన రాష్ట్రంలో పూర్తిగా తీసుకొస్తామన్నారు. స్నేహ పూర్వక వాతావరణం లో అద్భుతాలు చేయాలన్న ఆలోచన తో ఉన్నామని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap