తెలుగు సినిమా పరిశ్రమని శాసించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలను కూడా శాసిస్తున్నాడు అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. అవును, ఏపీలో కొత్త ఉప ముఖ్యమంత్రిగా జనసేనాని పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించినప్పుడునుండి మీడియా మొత్తం అతని చుట్టూనే తిరుగుతోంది. దాంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఆయనకు కీలకమైన శాఖలు పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా అయిదు అతి ముఖ్యమైన శాఖలు లభించిన సంగతి అందరికీ తెలిసినదే.

ఈ నేపథ్యంలోనే మన డిప్యూటీ సీఎంకి ప్రభుత్వం వై కేటగిరీ భద్రత కల్పిస్తోంది. వై కేటగిరీ అంటే ఇద్దరు కమెండోలతో సహా 11 మందితో భద్రత కల్పిస్తున్నారు. వారిలో ముగ్గురు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు 24 గంటలూ పవన్ భద్రతను చూస్తారు. అదే విధంగా 2 బుల్లెట్ ప్రూఫ్ కార్లతో పాటు 3 వాహనాలను ప్రభుత్వం సమకూరుస్తుంది. అసలు విషయం ఏమిటంటే ఏపీలో మరే మంత్రికి లేని విధంగా పవన్ కి భారీ భద్రతను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు తరువాత పవన్ కళ్యాణ్ కే ఈ విధంగా భారీ బందోబస్తు సమకూర్చడం జరిగింది. దాంతో దీనిపై భిన్న స్వరాలు వినబడుతున్నాయి.

అయితే సహజంగానే సెలిబ్రిటీ అయినటువంటి పవన్ కళ్యాణ్ కి ఆమాత్రం సెక్యూరిటీ లేకపోతే చాలా సమస్య వస్తుందని ప్రభుత్వం అవసరం అయిన దాని కంటే ఎక్కువమందిని నియమించిందని సమాచారం. ఇవన్నీ పక్కన పెడితే ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పవన్ కి మరింత భద్రత పెంచడం అనివార్యం అని బాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అవును, ఆయన ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది జనాలు ఆయన వెంట వస్తారు. దాంతో పవన్ కళ్యాణ్ భద్రతను మరింతగా పెంచితేనే బాగుంటుంది అని సామాన్య జనాలు అంటున్నారు. మరో వైపు పవన్ కళ్యాణ్ తనకు అప్పగించిన మంత్రిత్వ శాఖల పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నారు. ఆయన తన మార్క్ యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసుకుంటున్నారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: