ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా మారారు. జనసేన పార్టీని స్థాపించి ఎన్నో ఏళ్ళు అయినప్పటికీ ఈసారి కూటమిలో భాగంగా గెలిచి ఉపముఖ్యమంత్రి పదవిని కూడా పొందారు. 2019 ఎన్నికలలో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలలో తనతో పాటు 21 మందిని గెలిపించుకొని 100% స్ట్రైక్ రేట్ తో సక్సెస్ గా ఉన్నారు. ఈ సమయంలోనే తాజాగా ఉప ముఖ్యమంత్రి హోదా విషయం పైన బాధ్యతలు తీసుకొని ముందుకు వెళ్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉండబోతోంది అనే విషయం పైన చాలామంది నేతలు అభిమానులు కూడా తీవ్ర ఆసక్తిని కనబరుస్తున్నారు.


పవన్ మాటలకు చేతలకు వ్యత్యాసం ఉంటుందా అనేది ఇప్పుడు క్యూస్షన్ గా మారింది. ఇలాంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ గురించి టిడిపి నేత పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. అనంతరం తను పవన్ కళ్యాణ్ ను ఎప్పుడూ కూడా తను కలవలేదని.. పవన్ కళ్యాణ్ ఇప్పుడే బాధ్యతలు తీసుకున్నారు మరో నెల తర్వాత ఆయన పరిపాలన విధానాల పైన స్పందించవచ్చు అంటూ వెల్లడించారు.


తనకు తెలిసి పవన్ కళ్యాణ్ ఎక్కువ కాలం రాజకీయాలలో ఉండకపోవచ్చు అని జెసి దివాకర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ తెలియజేశారు. ఎందుకంటే ఆర్థికంగా చూసుకుంటే రాజకీయాలలో కంటే సినిమాలలోనే బెటర్ అని తెలియజేశారు. ఆ సమయంలో కుల రాజకీయాల పైన స్పందించిన ఆయన పవన్ కళ్యాణ్ కు బేస్ కులమే అని కులమే పవన్ స్ట్రాంగ్ గా సపోర్ట్ చేసిందని వెల్లడించారు. మరి పవన్ కళ్యాణ్ కు కులంతో రాజకీయం ముడిపడి ఉందా ఇష్యులతో ఉంటాయా అనే విషయం తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఉండాలని తెలియజేశారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ పైన చేసిన ఈ వాక్యాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: